వైరల్: చెత్త కవర్ ను టిషర్ట్ గా మారిస్తే ఇలానే ఉంటుందేమో ...!

ఒకప్పుడు బట్టలు పత్తి, ఉన్ని, సిల్క్ , ఖద్దర్ తో తయారు చేసినవి వేసుకునేవారు.రాను రాను రకరకాల ఫ్యాబ్రిక్స్ తో తయారు చేయడం మొదలుపెట్టారు.

 Viral This Is How It Looks When Garbage Cover Turns Into A T Shirt, Viral Latest-TeluguStop.com

అయతే ఫ్యాషన్ రంగం కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో రకరకాల ఫ్యాషన్ దుస్తులు రకరకాల వస్తువులతో తయారు చేయడం మనం చూసే ఉంటాము.ఉదాహరణకి ధాన్యం బస్తాలను వెస్ట్రన్ వేర్ గా ధరించడం, తల దిండును అచ్చాదనంగా అడ్డుపెట్టుకుని ఫోటోలకు ఫోజులు ఇవ్వడం ఇలాంటివి.

ఫ్యాషన్ డిజైన్ లలో ఇంకా ఎక్కువగా వెరైటీ దుస్తులను వాడటం మనం చూసే ఉంటాము.అయితే ఇప్పుడు చెత్త ఏరుకునే ప్లాస్టిక్ కవర్ బ్యాగులను టీ-షర్ట్ గా ధరించి నయా ట్రెండ్ సృష్టిస్తున్నాడు టర్కిష్ చెఫ్ నస్రెట్ గోక్సే.


టర్కిష్ చెఫ్ నస్రెట్ గోక్సే పేరు వినే ఉంటారు.యూట్యూబ్ లో ఇతని వీడియోలు చూసే ఉంటాము.

ఆహారం పై ఉప్పు చల్లుతూ, నమ్మశక్యంగాని వస్తువులతో మాంసాన్ని కోసి చూపిస్తూ సాల్ట్ బే గా పేరు తెచ్చుకున్నాడు.అయితే ఇప్పుడు ఈ చెఫ్ కొత్తగా చెత్త వేసుకునే ప్లాస్టిక్ కవర్ ను టీషిర్ట్ లాగా ధరించి ఫోజులిస్తున్నాడు.

పక్షికి గింజలు వేయడం, పుషప్స్ చేయడం లాంటివి చేస్తూ ఉన్న ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.ఇప్పుడు ఈ చెఫ్ చేసిన ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది.

Telugu Dustbin, Garbagecover, Latest Coverage, Latest, Salt Bae, Strangegarbage,

సోషల్ మీడియాలో టర్కిష్ చెఫ్ నస్రెట్ గోక్సే వీడియో తెగ వైరల్ అవుతుండడంతో ఇదేదో గ్రేట్ ఫ్యాషన్ ట్రెండ్ లాగా ఉందని కొందరు ఫాలో అవుతున్నారు.అలాగే మరి కొందరు ఇదెక్కడి దిక్కుమాలిన ఫ్యాషన్ రా బాబు అని తలలు బాదుకుంటున్నారు.చెఫ్ నస్రెట్ గోక్సే తన రేస్టారెంట్ లో అధిక ధరలు ఉండడంతో ఇలా వెరైటీగా ధరించాడేమో అంటూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు.దీంతో ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్ లు వస్తుండడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube