అడవి దున్నలు, మొసలి మధ్య భీకర ఫైట్.. చివరకు..

సాధారణంగా జంతువుల మధ్య వేట చాలా భయంకరంగా ఉంటుంది.ఆ వేటను చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది.

 Fierce Fight Between Wild Boars And Crocodile Finally Wild Boars, Crocodile, V-TeluguStop.com

అటువంటి వేటకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది.సదరు వీడియోలో అడవి దున్నలతో, సముద్రపు అలాగ్జెండర్ మొసలి ఫైట్ చేస్తోంది.

జంతువుల బలాబలాలు ఒక్కో ప్రదేశంలో ఒకోలా ఉంటాయి.ఉదాహరణకు మొసలికి నీటిలో ఉన్నపుడు చాలా బలం ఉంటుంది.

అదే భూమ్మీదకు వస్తే తక్కువగా ఉంటుంది.ఇకపోతే చిరుత కాని, అడవి దున్నలు కాని, సింహం కాని భూమ్మీద ఉన్నపుడు భీకరంగా ఫైట్ చేయగలవు.

కానీ, నీటిలోకి వెళ్తే వాటి శక్తి కొంత మేర తగ్గుతుంది.అటువంటి పరిస్థితి తాజా వైరల్ వీడియోలో మనం చూడొచ్చు.అటవీ ప్రాంతంలో కొన్ని అడవి దున్నలు ఓ వాగును దాటుతున్నాయి.ఇంతలోనే ఆ అడవి దున్నలపై దాడికి సిద్ధమైంది నీటిలోని మొసలి.

ఒక దాని వెనుక మరొకటిగా వెళ్తున్న అడవి దున్నలపై మొసలి దాడికి సిద్ధమైంది.అదును చూసి ఓ అడవి దున్నపై మొసలి అటాక్ చేసింది.

అంతలోనే అడవి దున్న చాకచక్యంగా మొసలి నుంచి తప్పించుకుంది.అయితే, మొసలి తన టార్గెట్ మార్చుకుని మరో అడవి దున్నపై దాడి చేసింది.

ఈ సారి మొసలి టార్గెట్ రీచ్ అయింది.శరవేగంగా దూసుకుపోయి అడవి దున్న మెడను పట్టుకుని నీటిలోనికి లాక్కుంది.

అలా అడది దున్న మొసలికి ఆహారమయింది.

ఇదంతా అవతల వైపున ఉన్న కొందరు వీడియో రికార్డు చేశారు.దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది నెట్టింట వైరలవుతోంది.ఈ వీడియోను చూసి నెటిజన్లు భయపడిపోతున్నారు.

మొసలికి నీటిలో వెయ్యి ఏనుగుల బలం ఉంటుందని, దాని నుంచి ఏ జంతువు తప్పించుకోలేదని అంటున్నారు.గతంలో చిరుతను సైతం అమాంతం నీటి లాగొసుకుంది ఓ మొసలి అని నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube