చడ్డీలు, మిడ్డీలు వేసుకున్నంత మాత్రాన అబ్బాయిలను అట్రాక్ట్ చేసినట్లు కాదు...

తెలుగులో ప్రముఖ ఎంటర్టైన్మెంట్ షో అయినటువంటి బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షో ఐదవ సీజన్ పై బాగానే ఆసక్తి నెలకొంది.కాగా ఈ సీజన్ ఇప్పటికే మూడు వారాలు పూర్తి చేసుకుని విజయవంతంగా 4వ వారంలో దూసుకుపోతోంది.

 Anchor Lahari Shari Comments About Her Cloths And Attitude, Telugu Anchor, Lahar-TeluguStop.com

అయితే ఈ షోలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి తెలుగు యంగ్ బ్యూటిఫుల్ హీరోయిన్ “లహరీ షరీ” గత ఆదివారం ఎలిమినేట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే.కాగా తాజాగా ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో లహరీ షరీ పాల్గొని బిగ్ బాస్ షోలో ఉన్నటువంటి కంటెస్టెంట్లపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఇందులో భాగంగా ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రియా తనని సోదరిగా భావిస్తున్నట్లు చెబుతున్న మాటలన్నీ అవాస్తవమని ఆమెకు నిజంగా తనపై అంత ప్రేమ ఉంటే కచ్చితంగా తన గురించి అందరి ముందు మాట్లాడుతూ రాద్దాంతం చేసేది కాదని ఒకవేళ తనని పక్కకు పిలిచి మంచి చెడుల గురించి చర్చించి ఉంటే కచ్చితంగా ఆమె మాట వినేదానినని చెప్పుకొచ్చింది.అంతేకాకుండా బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్న మరో నటి “సిరి హనుమంతు” కూడా తాను ధరించినటువంటి బట్టలను బట్టి తన క్యారెక్టర్ డిసైడ్ చేయడానికి ప్రయత్నించిందని తెలిపింది.

ఈ క్రమంలో తాను మిడ్డీలు, మైక్రో మిని మిడ్డీలు, ధరించడంతో ఏకంగా అబ్బాయిలను అట్రాక్ట్ చేయడానికి అలాంటి పొట్టి పొట్టి దుస్తులు ధరించి గేమ్ ఆడుతున్నట్లు తనపై వ్యాఖ్యలు చేసిందని ఇది ఏమాత్రం సరికాదని చెప్పుకొచ్చింది.

Telugu Anchorlahari, Bigboss, Lahari Shari, Ups, Season, Telugu Anchor-Movie

అంతేకాకుండా ప్రతి యువతి, యువకుడు తమకు నచ్చిన దుస్తులు ధరించే హక్కు ఉంటుందని అలాగే తనకి కూడా తనకు ఇష్టం వచ్చినట్లు బట్టలు ధరించే హక్కు ఉంటుందని కాబట్టి తాము ధరించినటువంటి బట్టలను ఆధారంగా చేసుకొని వ్యక్తిత్వాన్ని నిర్ణయించడం సరికాదని తెలిపింది.అయితే తాను గతంలో ఇంటర్వ్యూ చేసే సమయంలో మరియు సినిమాల్లో నటించే సమయంలో కూడా తన డ్రెస్సింగ్ స్టైల్ ఒకేలా ఉందని దాంతో స్లీవ్ లెస్ దుస్తులు, మినీ స్కర్ట్స్, మిడ్డీలు, వంటి దుస్తులను ధరించడం తనకు సౌకర్యంగా ఉంటుందని చెప్పుకొచ్చింది.అంతేకాకుండా తాను బట్టలు ధరించినపుడు ఎలా మెలగాలి అనే విషయంపై కూడా తనకు పూర్తిగా అవగాహన ఉందని కాబట్టి ఈ విషయంలో ఇతరుల జోక్యం తగదని కూడా సూచించింది.

అంతేకాకుండా ఒక అమ్మాయి చెడ్డీలు, మిడ్డీలు వంటి దుస్తులు ధరించి బయట తిరిగినంత మాత్రాన అబ్బాయిలను అట్రాక్ట్ చేసినట్లు కాదని అది కేవలం తమ సౌకర్యానికి తగ్గట్లుగా దుస్తులు ధరించడమని అందులో పాయింట్ అవుట్ చేయడానికి పెద్దగా ఏమి లేదని తన అభిప్రాయాన్ని తెలిపింది.అలాగే తనతోపాటు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్లు అందరూ దాదాపుగా బనియన్లు, షాట్లు వేసుకొని తిరుగుతుంటారని కానీ సిరి హనుమంతు కి మాత్రం తాను షాట్లు, మినీ స్కర్టులు ధరిస్తే సమస్య వచ్చిందని అందువల్లనే బిగ్ బాస్ హౌస్ లో నుంచి ఎలిమినేట్ అవుతున్న సమయంలో ఈ విషయం గురించి సిరి హనుమంతు కి తెలిపానని చెప్పు కొచ్చింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కొంతకాలం పాటూ ఓ న్యూస్ మీడియా ఛానల్ లో న్యూస్ రీడర్ గా కూడా పని చేసింది ఆ తర్వాత టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్ రెడ్డి చిత్రంలో నర్స్ క్యారెక్టర్ లో నటించి బాగానే ఆకట్టుకుంది ఆ తర్వాత ఈ అమ్మడికి వరుసగా సినిమా అవకాశాలు బాగానే ఉంటాయి.ఇటీవలే నితిన్ హీరోగా నటించిన మాస్ట్రో చిత్రంలో కూడా ఓ ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించి బాగానే అలరించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube