1.కస్తూర్బా స్కూళ్ల స్థాయి పెంపు
తెలంగాణలోని 36 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల స్థాయిని ఇంటర్మీడియట్ వరకు పెంచుతున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.
2.టీఆర్ఎస్ పార్లమెంటరీ
నియోజకవర్గాల ఇంచర్జీల సమావేశం కేటీఆర్ అధ్యక్షతన జరగనుంది.
3.సైదాబాద్ సింగరేణి కాలనీ స్థానికుల పై కేసు నమోదు
సైదాబాద్ సింగరేణి కాలనీ స్థానికులపై పోలీసులు కేసు నమోదు చేశారు.ఈనెల 10న తమ విధులకు ఆటంకం కలిగించేలా ప్రవర్తించిన స్థానికులు కొందరు పై కేసు నమోదు చేశారు.
4.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.శుక్రవారం తిరుమల శ్రీవారిని 22,766 మంది భక్తులు దర్శించుకున్నారు.
5.వైన్ షాపుల లైసెన్స్ గడువు పొడిగింపు
వైన్ షాప్ లైసెన్స్ గడువు పభుత్వం పొడిగించింది.అక్టోబర్ 31 ముగియనున్న లైసెన్స్ గడువు ను నవంబర్ 30 వరకు పొడిగించారు.
6.20 లోపు మోడల్ స్కూల్లో ప్రవేశాలు
తెలంగాణ వ్యాప్తంగా మోడల్ స్కూళ్ళలో బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ కి నిర్వహించిన ప్రవేశ పరీక్షలో ర్యాంకు పొందిన విద్యార్థులకు ఈ నెల 20 వ తేదీ లోపు ఆయా స్కూళ్ళలో చేరాలని మోడల్ స్కూల్స్ డైరెక్టర్ తెలిపారు.
7.అగ్రి డిప్లమో కోర్సులకు కౌన్సిలింగ్
ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం గుర్తింపు పొందిన ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో రెండు సంవత్సరాల వ్యవసాయ, సేంద్రియ వ్యవసాయం డిప్లమో కోర్సులకు , మూడేళ్ల డిప్లమో ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్సులకు ప్రవేశాలు జరపనుంది.ఈ నెల 20 నుంచి 25 వ తేదీ వరకు కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్టు వర్సిటీ రిజిస్టార్ సుధీర్ కుమార్ తెలిపారు.
8.ఎడ్ సెట్ 21 న
ఏపీ లో బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 21న ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఎడ్సెట్ 2021 నిర్వహించనున్నట్లు ప్రొఫెసర్, కన్వీనర్ విశ్వేశ్వరరరావు తెలిపారు.
9.ఎంపీలు చైర్మన్ గా జిల్లా స్థాయి విద్యుత్ కమిటీ లు
విద్యుత్ రంగంలో కేంద్రం మరింత ప్రభావవంతంగా అమలు చేయడంతోపాటు నిరంతరం పర్యవేక్షణ కు జిల్లాస్థాయి విద్యుత్ కమిటీలను వేయాలని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది.జిల్లా స్థాయిలో సీనియర్ పార్లమెంట్ సభ్యుడు చైర్మన్ గా ఉంటారు.
10.టాలీవుడ్ డ్రగ్స్ కేసు
డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ నటుడు తనీష్ ఈడి అధికారుల ఎదుట విచారణకు హాజరు అయ్యారు.
11.బాబు ఇంటిపై దాడులు.టీడీపి ఆందోళనలు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటి పై వైసీపీ దాడులను టిడిపి నేతలు రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి నేతలు నిరసనలు తెలిపారు.
12.ఎమ్మెల్యే జోగి రమేష్ డ్రైవర్ ఫిర్యాదు.టిడిపి నేతల పై కేసు నమోదు
వైసిపి ఎమ్మెల్యే జోగి రమేష్ డ్రైవర్ తాండ్ర రాము ఫిర్యాదు పై తాడేపల్లి పోలిసులు టిడిపి నేతలపై కేసు నమోదు చేశారు.
13.నేటి నుంచి ‘ ఆ ఈట్ ‘ రెండో కౌన్సిలింగ్
ఆంధ్ర వర్సిటీ లోని ఇంజనీరింగ్ కళాశాలల్లో ఆరేళ్ల డ్యూయల్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఆ ఈట్ 2021 రెండో విడత కౌన్సెలింగ్ నేటి నుంచి 20 వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు వర్సిటీ అధికారులు తెలిపారు.
14.ఏపీ ఫైబర్ నెట్ కేసు
ఏపీ ఫైబర్ నెట్ కేసులో ఐ ఆర్ టీ సీ అధికారి సాంబశివరావు ను సీఐడీ అరెస్ట్ చేసింది.
15.గవర్నర్ ను కలవనున్న టిడిపి నేతలు
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను ఈరోజు టిడిపి నేతలు కలవనున్నారు.నిన్న టిడిపి అధినేత చంద్రబాబు ఇంటి పై వైసీపీ శ్రేణులు దాడులకు జగన్ పై ఫిర్యాదు చేయనున్నారు.
16.కాకినాడ మేయర్ పై వైసీపీ అవిశ్వాస తీర్మానం
కాకినాడ కార్పొరేషన్ టీడీపీ మేయర్ పై వైసీపీ విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది.
17. తెలంగాణ లో భారీ వర్షాలు
ఈ నెల 20,21 తేదీల్లో రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
18.గిరిజన నిరుద్యోగులకు ఉచిత శిక్షణ
తెలంగాణలో గిరిజన నిరుద్యోగ యువతకు జాతీయ నిర్మాణ సంస్థ ( న్యాక్ ) ఆధ్వర్యంలో వివిధ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కమలాకర్ రెడ్డి తెలిపారు.
19.నీట్ లో ఓ బీసీ కోటా పై కేంద్రానికి నోటీసులు
నీట్ అడ్మిషన్ లలో ఓ బీసీలకు 27 శాతం , ఆర్థిక బలహీన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలైన తాజా వ్యాజ్యం పై సుప్రీం కోర్టు కేంద్రం , మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ లకు నోటీసులు ఇచ్చింది.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 45,390 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 46,390