గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు.2017 వ సంవత్సరం లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.అహ్మదాబాద్ పాలిటెక్నిక్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ లో డిప్లమా .2010 వ సంవత్సరంలో అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ గా గెలుపొందారు.2010-2015 వరకు అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సంఘం చైర్మన్ గా తర్వాత అహ్మదాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా రాణించారు.ఆ తర్వాత 2017వ సంవత్సరంలో ఘట్లోడియా నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
లక్షా 17 వేల మెజారిటీతో గెలుపొందారు.ఆ సమయంలో జరిగిన ఎన్నికలలో అత్యధిక మెజారిటీ సాధించిన ఎమ్మెల్యే గా భూపేంద్ర పటేల్ రికార్డు సృష్టించారు.రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎంతో పేరు సంపాదించిన భూపేంద్ర పటేలా అహ్మదాబాదులో జన్మించారు.ఇటీవల విజయ్ రూపాన్ని ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో భూపేంద్ర పటేల్ నీ బీజేపీ అధిష్టానం ఎన్నుకోవడం జరిగింది.
కొద్ది గంటల ముందు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.