రాం చరణ్, శంకర్ కాంబినేషన్ లో సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే.దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.
థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో ఎన్ని సాంగ్స్ ఉంటాయన్నది రివీలైంది.ఆర్సీ 15 సినిమాలో థమన్ ఏకంగా 7 సాంగ్స్ కంపోజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
ఈమధ్య వరుస క్రేజీ ప్రాజెక్ట్ లతో దూసుకెళ్తున్నాడు థమన్.ఇక శంకర్ లాంటి ప్రెస్టిజియస్ డైరక్టర్ తో పనిచేయడం థమన్ మీద మరింత బాధ్యత ఉందని చెప్పొచ్చు.శంకర్ ఇన్నాళ్లు ఏ.ఆర్.రెహమాన్ తో పనిచేశారు.మొదటిసారి థమన్ తో సినిమా చేస్తున్నారు.
థమన్ కూడా శంకర్ మెప్పు పొందేలా మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడని తెలుస్తుంది.సినిమాలో మ్యూజిక్ విషయంలో కూడా చాలా స్పెషల్ గా ఉండేలా చూస్తున్నారు.శంకర్ సినిమాలో మ్యూజిక్ అంటే చాలా ప్రత్యేకతలు ఉంటాయి.ఇక సాంగ్స్ గురించి చెప్పనక్కర్లేదు.
అందుకే అందివచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగ పరచుకునేందుకు థమన్ కష్టపడుతున్నాడని తెలుస్తుంది.అంతేకాదు సినిమా కోసం థమన్ ఇప్పటికే 4 సాంగ్స్ కంపోజ్ చేశాడని టాక్.
శంకర్ కూడా వాటికి ఓకే చెప్పాడని అంటున్నారు.పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఆర్సీ 15 థమన్ మ్యూజిక్ కూడా హైలెట్ గా ఉంటుందని టాక్.