కలోంజి సీడ్స్‌ఇదివరకంటే ఇవి పెద్దగా తెలియకపోవచ్చు.కానీ, ప్రస్తుత కాలంలో చాలా మంది కలోంజి సీడ్స్‌ను విరి విరిగా ఉపయోగిస్తున్నారు.
ఇవి బరువు తగ్గించడంలోనూ, ఇమ్యూనిటీ పవర్‌ను పెంచడంలోనూ, మధుమేహాన్ని కంట్రోల్ చేయడంలోనూ, ఆస్తమాను నివారించడంలోనూ అద్భుతంగా సమాయపడతాయి.అలాగే చర్మానికి కూడా ఎంతో కలోంజి సీడ్స్‌ను ఎన్నో బెనిఫిట్స్‌ను అందిస్తాయి.
ముఖ్యంగా ఆయిలీ స్కిన్‌తో బాధ పడే వారికి ఈ కలోంజి సీడ్స్ అద్భుతమైన వరమనే చెప్పాలి.
అవును, ఈ కలోంజి సీడ్స్‌ను సరైన పద్ధుతుల్లో వాడితే గనుక .అదునపు జిడ్డు పోయి చర్మం కాంతివంతంగా మరియు ఫ్రెష్‌గా కపిస్తుంది.మరి ఏ మాత్రం లేట్ చేయకుండా కలోంజి సీడ్స్‌ను చర్మానికి ఎలా యూజ్ చేయాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా కొన్ని కలోంజి సీడ్స్ తీసుకుని మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ కలోంజి సీడ్స్ పౌడర్‌కి, ఒక స్పూన్ లెమెన్ పీల్ పౌడర్ మరియు రెండు స్పూన్ల తేనెను యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసి పది నిమిషాల అనంతరం స్మూత్‌గా స్క్రబ్ చేసుకుంటూ వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి.ఇలా చేస్తే ఎక్సస్ ఆయిల్ తొలిగి పోయి చర్మం ఎంతో ఫ్రెష్‌గా మరియు గ్లోగా కనిపిస్తుంది.
అలాగే బౌల్‌లో ఒక స్పూన్ కలోంజి సీడ్స్ పౌడర్, ఒక స్పూన్ రైస్ ఫ్లోర్ మరియు నిమ్మ రసం వేసుకుని కలుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమానికి ఫేస్ మరియు నెక్‌కు పూసి.డ్రై అయిన తర్వాత మెల్ల మెల్లగా రుద్దుకుంటూ కూల్ వాటర్‌తో శుభ్రం చేసుకోవాలి.ఇలా రోజూ చేసినా ఆయిలీ స్కిన్‌కు దూరంగా ఉండొచ్చు.