ఈ మధ్య స్మార్ట్ ఫోన్ల వినియోగం బాగా పెరిగింది.ప్రతి ఒక్కరి ఫోన్లో ఇప్పుడు ఇంటర్నెట్ తప్పనిసరి.
ఎందుకంటే ఇంటర్నెట్ లేకుండా స్మార్ట్ ఫోన్ వినియోగం అనేది అసాధ్యమన్నట్లు ఉంది.ఇక ఇంటర్నెట్ కోసం ఎంత ఖర్చు చేసేందుకైనా రెడీగా ఉన్నారు యూజర్స్.
ఇక కొన్ని నగరాల్లో అయితే ముఖ్యమైన ప్రాంతాల్లో ఉచిత వైఫై అందుబాటులో ఉంటుంది.హైదరాబాద్ నగరంలోనూ దాదాపు అన్ని ఏరియాల్లో ఉచిత వైఫై సదుపాయం ఉంది.
ఈ క్రమంలో ప్రముఖ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ యాక్ట్ తన యూజర్ల శుభవార్త చెప్పింది.
ఇంటి వద్ద కాకుండా బయట కూడా ఉచిత ఇంటర్నెట్ ఉపయోగించుకునేలా సర్వీస్ ప్రొవైడ్ చేస్తోంది.
ఉచిత ఇంటర్నెట్ అందించేందుకు నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఉచిత వైఫై జోన్లు ఏర్పాటు చేసింది.యాక్ట్ స్మార్ట్ ఫైబర్ టెక్నాలజీ సహాయంతో తన కస్టమర్లకు ఉచిత ఇంటర్నెట్ అందిస్తోంది.
ఇళ్లు, ఆఫీసుల దగ్గర ఏ ప్లాన్ తో ఇంటర్నెట్ కనెక్షన్ ఉపయోగిస్తున్నామో.అదే ప్లాన్ తో ఉచిత వైఫై జోన్ల వద్ద హై ఫై లో ఏర్పాటు చేసిన ఇంటర్నెట్ ను వాడుకోవచ్చు.
ఫ్రీ వైఫై సెంటర్ల వద్ద సాధారణ యూజర్లు 25 mbps స్పీడ్ తో 45 నిమిషాల పాటు ఇంటర్నెట్ వాడొచ్చు.అదే యాక్ట్ యూజర్లకు ఇంటి దగ్గర ఏ స్పీడ్ తో అపరమిత ఇంటర్నెట్ సౌకర్యం ఉంటుందో.
హైదరాబాద్ మెట్రో పరిధిలోని 47 స్టేషన్లలోనూ అదే సౌకర్యంతో ఇంటర్నెట్ పొందవచ్చు.
హైదరాబాద్ తో పాటు వరంగల్ లోనూ ఈ సదుపాయాన్ని యాక్ట్ సంస్థ అందుబాటులోకి తెచ్చింది.వరంగల్, హన్మకొండ, కాజీపేటల పరిధిలో మొత్తం 18 ఫ్రీ వైఫ్ సెంటర్లను తీసుకొచ్చింది.కళాశాలలు, లైబ్రరీలు, పోలీస్ స్టేషన్ లు, ఆస్పత్రులు, షాపింగ్ మాల్స్ వంటి ప్రాంతాల్లో ఫ్రీ వైఫ్ ఏర్పాటు చేసింది.
ఉచిత వైఫై కోసం ఏంచేయాలంటే.ముందుగా హై ఫై నెట్ జోన్ పరిధిలో వెళ్లాలి.
అక్కడ వైఫై సెట్టింగ్స్ లో ACT Free HY-Fi సెలెక్ట్ చేయాలి.వెంటనే యూజర్ లాగిన్ పాప్ అప్ వద్ద రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.
తర్వాత మొబైల్ నెంబర్ కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి.సాధారణ వినియోగదారుల కాల పరిమితి ముగిసిన తర్వాత రూ.25,రూ.50 తో టాపప్ పొందవచ్చు.యాక్ట్ కస్టమర్లు ఇంటి దగ్గర ప్లాన్ కొనసాగించుకోవచ్చు.