సాధారణంగా దొంగతనం చేయాలనుకున్న ఎవరైనా తమ పనిని సైలెంట్‌గా చేయాలనకుంటారు.కానీ, ఈ వ్యక్తి వెరీ డిఫరెంట్.
బెదిరింపు చీటి ఇచ్చి మరీ తాను చోరీ చేయబోతున్నానని చెప్పాడు.ఇంతలోనే వారు అలర్ట్ అయిపోయి సదరు వ్యక్తిని అరెస్టు చేశారు.
ఇంతకీ ఈ వింత ఘటన ఎక్కడ జరిగింది? అనే విషయం తెలియాలంటే మీరు ఈ స్టోరీని కంప్లీట్‌గా రీడ్ చేయాలంతే.
ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఓ 67 ఏళ్ల వృద్ధుడు బ్యాంక్ చోరికి ప్రయత్నించి కటకటాల పాలయ్యాడు.
వివరాల్లోకెళితే.స్లాటరీ అనే ముసలాయన ఒకాయన ఓ బెదిరింపు చీటి ఇచ్చి మరీ దొంగతనం చేశాడు.
అసలేం జరిగిందంటే.వృద్ధుడు బెదిరింపు చీటిని తీసుకెళ్లి నేరుగా క్యాషియర్ దగ్గరకు వెళ్లాడు.
అతడి చేతిలో ఓ బెదిరింపు చీటీ పెట్టాడు.అయితే, చీటీలో చేతిరాత అర్థం కాక క్యాషియర్ దాన్ని పక్కన పెట్టేసి తన పనిలో మునిగిపోయాడు.
ఆ క్యాషియర్ వైపు ఓ సారి ఎగాదిగా చూసి అక్కడినుంచి వెళ్లిపోయాడు వృద్ధుడు.కొద్దిసేపటి తర్వాత చీటి చదివిన ఆ సిబ్బంది ఆ ముసలాయన ఏం రాశాడో అర్థమై ఒక్కసారిగా షాక్ తిన్నారు.
వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.స్లాటరీ ఈ సారి అదే బ్యాంకుకు చెందిన మరో బ్రాంచ్‌కు వెళ్లాడు.
అక్కడా అదే పని చేశాడు.క్యాషియర్ దగ్గరకు వెళ్లి మునుపటి లాగే ఓ చీటీ అతడి చేతిలో పెట్టాడు.
అది చదివిన క్యాషియర్ ఘోరంగా భయపడిపోయాడు.వెంటనే 2,400 స్టెర్లింగ్ పౌండ్స్ అనగా ఇండియన్ కరెన్సీలో దాదాపు రెండున్నర లక్షలు స్లాటరీ అనే ముసలాయన చేతిలో పెట్టాడు.
ఇలా ముసలాయన మరో బ్యాంకు బ్రాంచి వద్దకు వెళ్లగా, అక్కడ ఇదే పని చేయబోయాడు.అప్పటికే సమాచారం పోలీసులకు చేరగా, వారు అలర్ట్ అయ్యారు.
సదరు ముసలాడిని పట్టుకునేందుకు బయల్దేరారు.ఈ మూడు బ్యాంకుల సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయిన ముసలాయన ఫుటేజీలను పరిశీలించారు.
అతడి వివరాలు సేకరించి అతడిని ఇంటివద్దే అరెస్టు చేశారు.ఈ వివారాలన్ని కోర్టు ముందర ఉంచగా, కోర్టు అతడికి ఆరేళ్ల జైలు శిక్ష విధించింది.