అనగనగా ఒక ధీరుడు సినిమాతో తెలుగులో శృతిహాసన్ నటిగా కెరీర్ ను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన శృతిహాసన్ తనకు సంబంధించిన ఎన్నో సీక్రెట్లను అభిమానులతో పంచుకుంటారనే సంగతి తెలిసిందే.
అయితే తనకు సినిమాల్లోకి రావడం అస్సలు ఇష్టం లేదని శృతి వెల్లడించారు.డబ్బుల కొరకు మొదట రెండు సినిమాలలో నటించి సినిమాలకు గుడ్ బై చెప్పాలని అనుకున్నారు.
తన రాక్ బ్యాండ్ కొరకు ఆ డబ్బులను సంపాదించాలని శృతిహాసన్ అనుకున్నారు.తన బ్యాండ్ లో పని చేసే వ్యక్తులకు తాను డబ్బులివ్వాలని యమహా మిక్సర్ తో పాటు డ్రమ్ కిట్ ను కొనుగోలు చేయాల్సి ఉండటంతో అందుకు సంబంధించిన బ్యాలెన్స్ షీట్ ను తాను తయారు చేసుకున్నానని శృతి హాసన్ వెల్లడించారు.
హోమ్ రెంట్ కూడా కట్టాల్సి ఉందని తొలి సినిమా రిలీజయ్యే నాటికి రాక్ స్టార్ కావాలని అనుకున్నానని శృతి తెలిపారు.
అయితే సినిమాల్లోకి వచ్చిన తర్వాత సినిమాల విషయంలో తనకు ఉన్న అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని శృతి అన్నారు.
సరిగ్గా చెప్పాలంటే సినిమా అనేది ఎరేజ్డ్ మ్యారేజ్ అని శృతి తెలిపారు.సినిమాల్లోకి వచ్చిన తర్వాత తాను సినిమాలను ప్రేమించడం మొదలుపెట్టడంతో పాటు సినిమా లేకపోతే ఉండలేని పరిస్థితి ఏర్పడిందని ఆమె అన్నారు.అయితే తన లైఫ్ లో మ్యూజిక్ కు కూడా ప్రాధాన్యత ఉంటుందని శృతి వెల్లడించారు.
ప్రస్తుతం సలార్ షూటింగ్ శృతి పాల్గొంటుండగా ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ షెడ్యూల్ ను పూర్తి చేశారు.బాలయ్య గోపీచంద్ మలినేని సినిమాలో అతిథి పాత్రలో శృతిహాసన్ కనిపించనున్నారని తెలుస్తోంది.గోపీచంద్ మలినేనిపై ఉన్న అభిమానంతో శృతిహాసన్ గెస్ట్ రోల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.