ఎనర్జిటిక్ హీరో రామ్ ఇప్పుడు కెరియర్ లో మొదటి సారి పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే.తమిళ్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో తన నెక్స్ట్ సినిమా ఎనౌన్స్ చేశాడు.
ఈ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ కూడా ఇప్పటికే ఫైనల్ అయ్యింది.పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ గా ఈ మూవీని లింగుస్వామి ఆవిష్కరించబోతున్నట్లు తెలుస్తుంది.
ఇక రామ్ కెరియర్ లో భారీ బడ్జెట్ తో రెండు, తమిళ్ బాషలలో ఈ మూవీని దర్శకుడు తెరకెక్కించబోతున్నారు.ఇక ఈ మూవీలో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.
రెడ్ మూవీ ఫ్లాప్ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న రామ్ కి లాక్ డౌన్ మరికొంత గ్యాప్ ఇచ్చింది.అయితే ప్రస్తుతం షూటింగ్ లకి అనుమతి వచ్చింది.
ఇప్పటికే చాలా సినిమా షూటింగ్ లు స్టార్ట్ అయ్యాయి.
హైదరాబాద్ చుట్టూ షూటింగ్ వాతావరణం కనిపిస్తుంది.
పదుల సంఖ్యలో సినిమా చిత్రీకరణలు జరుగుతున్నాయి.ఈ నేపధ్యంలో రామ్ లింగుస్వామి కూడా తమ సినిమా షూటింగ్ షెడ్యూల్ ని అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు.
ఈ నెల 12 నుంచి మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని తెలిపారు.ఇక ఫస్ట్ షెడ్యూల్ లో గ్యాప్ లేకుండా టాకీ పార్ట్ వీలైనంత వరకు పూర్తి చేయడానికి దర్శకుడు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
కమర్షియల్ బ్లాక్ బస్టర్ కొట్టడానికి రామ్ సరికొత్త పాత్రలో రాబోతున్న ఈ సినిమా అంతానికి ఎంత వరకు సక్సెస్ ఇస్తుంది అనేది చూడాలి.కృతి శెట్టి ఈ సినిమాలో నటిస్తూ ఉండటం కూడా సినిమాకి కొంత హైప్ వచ్చే అవకాశం ఉంది.