యాపిల్ తెలసు, గ్రీన్ యాపిల్ తెలుసు, ఐస్ యాపిల్ కూడా తెలుసు.మరి ఈ వాటర్ యాపిల్ ఏంటబ్బా.? అనేగా మీ డౌట్.వేసవిలో విరి విరిగా కాసే ఈ వాటర్ యాపిల్స్‌కు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంటుంది.
చాలామందికి పెద్దగా తెలియని ఈ వాటర్ యాపిల్‌ను వైట్ జామూన్ అని, జంబూ ఫలం అని కూడా పిలుస్తుంటారు.చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా ఉండే ఈ వాటర్ యాపిల్స్ కొంచెం తియ్యగా, కొంచెం వగరుగా ఉంటాయి.
ఈ పండ్లలో నీటి శాతం అధికంగా ఉంటుంది.
ఇక నోట్లో వేసుకున్న వెంటనే కరిగిపోయే ఈ వాటర్ యాపిల్స్‌లో పోషకాలు కూడా మెండుగానే ఉంటాయి.
విటమిన్ బి, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోషకాలు వాటర్ యాపిల్ ద్వారా పొందొచ్చు.అందుకే ఈ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
ముఖ్యంగా ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోవాలి అని ప్రయత్నించే వారు ఈ వాటర్ యాపిల్‌ను తీసుకోవడం చాలా మంచిది.వాటర్ యాపిల్‌లో ఉండే విటమిన్ సి, జింక్ పోషకాలు.శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.దాంతో వైరస్‌లు దరి చేరకుండా ఉంటాయి.అలాగే మధుమేహం వ్యాధి గ్రస్తులకు ఈ వాటర్ యాపిల్ ఓ దివ్యౌషధంగా పని చేస్తుంది.అవును, ఈ పండ్లను తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయి.
సమ్మర్‌లో ఆ వాటర్ యాపిల్‌ను తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు.ఒత్తిడి, మానసిక అందోళన, అలసట, నీరసం వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి.
అధిక రక్త పోటును తగ్గించడంలోనూ ఈ వాటర్ యాపిల్ సహాయపడుతుంది.రెగ్యులర్‌గా ఒకటి చప్పున ఈ వాటర్ యాపిల్‌ను తీసుకుంటే.
రక్త పోటు కంట్రోల్‌లో ఉంటుంది.