ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ ఎవరిని విడిచి పెట్టడం లేదు.సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరిని సమానంగా చూసుకుంటూ తన పని తాను చేసుకుంటూ పోతుంది.
ప్రస్తుతం ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉన్న సంగతి తెలిసిందే.కేసులు భారీగా నమోదు కావడంతో పాటు మరో పక్క వైద్యం అందక చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉండటంతో.
ప్రపంచంలో మిగతా దేశాలు ఇండియాకి బాసటగా నిలుస్తూ హెల్ప్ చేయడానికి ముందుకు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే ప్రధాని మోడీ కుటుంబాన్ని కూడా వదల్లేదు ఈ మహమ్మారి కరోనా.మోడీ పిన్ని నర్మదా బెన్ ఇటీవల కరోనా బారిన పడ్డారు.80 సంవత్సరాల వయసు కలిగిన ఈమె పది రోజుల క్రితం హాస్పిటల్లో జాయిన్ అయ్యారు.ఈరోజు తుది శ్వాస విడిచారు.జాయిన్ చేసిన సమయంలోనే పరిస్థితి విషమించడంతో.ఈ విషాద సంఘటన చోటుచేసుకున్నట్లు ప్రధాని మోడీ పెద్దన్నయ్య ప్రహ్లాద్ మోడీ తెలియజేశారు. మోడీ తండ్రి దామోదర్ దాస్ సోదరుడు జగజీవన్ దాస్ భార్య నర్మదా బెన్.
ఈ విషాద వార్త తెలుసుకుని దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.