ప్రపంచాన్ని వణికిస్తూ వేలాదిమందిని పొట్టబెట్టుకుంటూ, మానవ సంబంధాలు పూర్తిగా చిదిమేస్తున్న కరోనా వైరస్ సంక్షోభంలో అన్ని వర్గాలు ముఖ్యంగా ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన రాజకీయ పార్టీలు నిర్లక్ష్యంవహిస్తున్నాయి.అధికారులు, వైద్యులు కరోనా డ్యూటీల సమయంలో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.
నర్సులు, సిబ్బంది పనిభారంతో అలసిపోతున్నారు.కుటుంబాలకు దూరంగా ఉండటం వల్ల తమ విధులను సరిగా చేయడం లేదు.
కరోనా రోగులు రోజురోజుకూ పెరిగిపోతున్నారు.దీంతో వైద్యుల కొరత ఉండటం వల్ల కొంతమంది వైద్యులపై పనిభారం పడుతోంది.
ఇటువంటి తరుణంలో చాలా మంది మధ్య భిన్నాభిప్రాయాలు, గొడవలు చోటుచేసుకుంటుండటం గమనార్హం.తాజాగా ఓ ఘటన చోటుచేసుకుంది.
ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ జిల్లా ఆసుపత్రిలో డాక్టర్ కు, నర్సుకు మధ్య గొడవ జరిగింది.వారు ఇద్దరూ ఒకరిని ఒకరు దూషించుకున్నారు.
మొదట నర్సు డాక్టర్ చెంపపై బలంగా కొట్టింది.దీంతో డాక్టర్ ఆమెను తిరిగి కొట్టాడు.
ఈ ఘటన సోమవారం పోలీసుల ముందే జరిగింది.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
డాక్టర్, నర్సు ఇద్దరితో విడివిడిగా మాట్లాడానని, ఇద్దరూ కూడా పని ఒత్తిడిని తట్టుకోలేకనే తాము సహనం కోల్పోయి అలా ప్రవర్తించామని చెప్పారని రాంపూర్ సిటీ మెజిస్ట్రేట్ మిశ్రా తెలిపారు.ఘటనపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.
ఆసుపత్రికి వచ్చిన ఒక వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
గత కొన్ని రోజులుగా ఆస్పత్రిలో కరోనా బాధితులు ఎక్కువగా వస్తున్నారు.
ఇటువంటి సమయంలో సిబ్బందిపై ఒత్తిడి ఎక్కువగా పడింది.ఈ తరుణంలో వైద్యులు, నర్సుల మధ్య ఏదోఒ క విషయమై వివాదాలు జరుగుతుండేవి.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వీడియోలో నర్సు, డాక్టర్ ఒకరిపై మరోకరు ఆరోపణలు చేసుకున్నారు.
అయితే ఈ ఘటనను దాచిపెట్టేందుకు ఆసుపత్రి వర్గాలు ప్రయత్నిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.డాక్టర్, నర్సు ఒకరినొకరు కొట్టుకున్న వీడీయో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రస్తుతం ఇది నెట్టింట హల్ చల్ చేస్తోంది.