దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈనెల 28, 29 తారీఖున జరగబోయే హోలీ వేడుకలను కొన్ని రాష్ట్రాలు నిషేధించాయి.కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న రాష్ట్రాలు మీ నిర్ణయం తీసుకున్నాయి.
నిషేధించిన రాష్ట్రాల వివరాలు చూస్తే మధ్యప్రదేశ్, బీహార్, చండీగఢ్, ఢిల్లీ వంటి రాష్ట్రాలు బ్యాన్ చేయడం జరిగింది.మరికొన్ని రాష్ట్రాలలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వాళ్లు కూడా ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే తెలంగాణ అదేవిధంగా ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలలో కొన్ని ఆంక్షలు విధిస్తూ పండుగను జరుపుకోవాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది.ప్రపంచవ్యాప్తంగా చాలా మంది జనాభాలో అత్యధికంగా జరుపుకునే వేడుకలు హోలీ.
అయితే ప్రస్తుతం దేశంలో సెకండ్ వేవ్ వచ్చే అవకాశం ఉండటంతో ఈ పండుగ విషయంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని డిసైడ్ అవుతున్నాయి.ఒకే చోట గుమిగూడిరంగునీళ్లు ఒకరిమీద ఒకరు జలుకునే పరిస్థితి ఉండటంతో కరోనా ఒకరి నుండి ఒకరికి సంక్రమించే అవకాశముండటంతో ఈ పండుగ విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.