వేసవి కాలం ప్రారంభం అయింది.ఎండలు మండిపోతున్నాయి.
ఈ సీజన్‌లో అధిక దాహం, వడగాలులు, వడదెబ్బలు, నీరసం, అలసట, చెమటలు, చికాకు ఇలా ఎన్నో సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి.అందుకే ఈ వేసవి కాలంలో ఆరోగ్యాన్ని, చర్మాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలని నిపుణులు ఎప్పటికప్పుడు చెబుతుంటారు.
అయితే ఈ వేసవి కాలంలో ఆరోగ్యానికి కొన్ని కొన్ని ఆహారాలు ఎంతగానో ఉపయోగపడతాయి.అలాంటి వాటిలో ఉల్లిగడ్డ ఒకటి.
కోసేటప్పుడు కన్నీరు పెట్టించే ఉల్లిగడ్డ ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు.ఉల్లిగడ్డలో విటమిన్ బి, విటమిన్ సి, పోటాషియం, కాల్షియం, సల్ఫర్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోషకాలు నిండి ఉన్నాయి.
అటువంటి ఉల్లి గడ్డ సమ్మర్ సీజన్‌లో తీసుకుంటే ఆరోగ్యానికి మరింత మంచిది.ముఖ్యంగా ఈ వేసవి కాలంలో ఎక్కువ శాతం మంది వడదెబ్బకు గురవుతుంటారు.
అయితే పచ్చి ఉల్లి గడ్డను స్వచ్చమైన తేనె కలిపి తీసుకోవాలి.ఇలా ప్రతి రోజు తీసుకుంటే.
వడదెబ్బ బారిన పడకుండా ఉంటాము.
అలాగే ఈ వేసవి కాలంలో శరీర ఉష్ణోగ్రతలు కూడా తీవ్రంగా పెరిగిపోతాయి.దాంతో అధిక దాహం, చెమటలు వంటి సమస్యలు ఏర్పడతాయి.అయితే ఉల్లి గడ్డకు చలువ చేసే గుణం ఉంది.
అందువల్ల పచ్చి ఉల్లిపాయను తీసుకుంటే శరీర ఉష్ణోగ్రతలు కంట్రోల్‌లో ఉంటాయి.ఇక నీరసం, అలసట సమస్యలను దూరం చేయడంలోనూ ఉల్లి గడ్డ ఉపయోగపడుతుంది.
పెరుగన్నంలో పచ్చి ఉల్లిపాయను కలిపి తీసుకోవడం లేదా మజ్జగతో పచ్చి ఉల్లిపాయను తీసుకోవడం చేస్తే నీరసం మరియు అలసట సమస్యలు దూరం అవుతాయి.వేసవిలో తరచూ ఇబ్బంది పెట్టే సన్ ట్యాన్ సమస్యను కూడా ఉల్లి గడ్డ దూరం చేస్తుంది.
ఉల్లి రసంలో నిమ్మరసం మరియు తేనె కలిపి సన్ ట్యాన్‌కు గురైన ప్రాంతంలో అప్లై చేసి.ఇరవై నిమిషాల తర్వాత క్లీన్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.