నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా నియోజక వర్గంలో వర్గపోరు ఉన్నదన్న విషయం విదితమే.ఎప్పటికప్పుడు ఇక్కడున్న నేతలతో రోజాకు ఏదో ఒక విషయంలో వివాదాలు తలెత్తడం ఈ విషయం అధిష్టానం దృష్టికి వెళ్ళడం కూడా జరిగింది.
అయితే ప్రస్తుత పరిస్దితుల్లో నగరి వైసీపీలో వర్గపోరును పంచాయతీ ఎన్నికలు బహిర్గతం చేశాయట.దీనివల్ల ఇక్కడ టీడీపీ జండా పాతే అవకాశాలు కనిపిస్తున్నాయట.దీంతో ఆగ్రహించిన రోజా నగరి నియోజకవర్గంలో సొంత పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారిని సస్సెండ్ చేయడమే కాదు, ఇంకోసారి ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తే చర్యలు తప్పదని హెచ్చరించారట.అలాంటి వారిని ఎరివేస్తానని స్టాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారట రోజా.
ఇదే కాకుండా రోజాను ఎన్నికల నామినేషన్ల సమయంలో రెబల్స్ తీవ్ర స్ధాయిలో ఇబ్బంది పెట్టారు.మున్సిపల్ ఎన్నికలలో అవకాశం ఇస్తానని చెప్పినా కొందరు నేతలు ఏమాత్రం వినకుండా రెబల్ అభ్యర్థులుగా బరిలో దిగారట.
ఈ క్రమంలో ఎన్నికల ఫలితాల వరకు వేచి చూసిన రోజా ఇప్పుడు వారిపై వేటు వేశారని టాక్ నడుస్తోంది.