కులం మతం అని ఈ లోకంలో సాటి మనుషులను నీచంగా చూసే వారు ఉన్నారు.ఏదైనా సహాయం చేయవలసి వచ్చినా వీడు మనవాడా కాదా అని ఆరా తీసి చేస్తారు.
ప్రతి మనిషిలో ప్రవహించే రక్తం రంగు ఎరుపే.అందరు పీల్చే గాలికి లేని కులం, మతం మనుషులకు ఎందుకో అర్ధం కాదు.
ఇక అయోధ్యలో రామమందిరం నిర్మించాలి అని తలచినప్పటి నుండి ఎందరో దీన్ని రాజకీయం చేస్తూ తమ స్వలాభం కోసం, పదవుల కోసం లేనిపోని పరుషపు మాటలు మాట్లాడుతున్న విషయం తెలిసిందే.కాని మన భారతదేశంలో అన్ని మతాల వారు అన్నదమ్ముల్లా కలసి మెలసి ఉంటున్న విషయం అర్ధం చేసుకోక వీరి మధ్యనే మత చిచ్చు పెడుతున్నారు.
కానీ మతం కంటే మానవత్వం గొప్పదని ఎన్నో సందర్భాల్లో రుజువు అయ్యింది.
తాజాగా కూడా నిరూపించింది.
ఇకపోతే అయోధ్యలో నిర్మించే రామ మందిర నిర్మాణానికి కర్ణాటకలో క్రైస్తవ వర్గానికి చెందిన వ్యాపారులు, విద్యానిపుణులు పెద్దమొత్తంలో విరాళాలను అందచేయడం అందుకు నిదర్శనం.
కాగా బెంగళూరులో ఆదివారం ఉప ముఖ్యమంత్రి డాక్టర్ సీ.ఎన్.అశ్వత్థనారాయణ ఏర్పాటు చేసిన సమావేశంలో క్రైస్తవ వర్గ వ్యాపారవేత్తలు, విద్యానిపుణులు, ఎన్‌ఆర్‌ఐలు, సీఇఓలు, సమాజ సేవకులు పాల్గొని మందిర నిర్మాణానికి తమవంతు సహాయం చేస్తామని భరోసా ఇవ్వడం హర్షించదగ్గ నిర్ణయం.
ఇదివరకు ముస్లిం సోదరులు కూడా విరాళాలు అందచేసిన విషయం తెలిసిందే.ఇకనైన కులం, మతం అంటూ కొట్టుకునే వారికి ఈ సంఘటనలతో కనువిప్పు కలిగితే మంచిది అని అనుకుంటున్నారట విషయం తెలిసిన కొందరు.