హైదరాబాద్ ను వదిలి వెళ్లిపోయిన ఆర్జీవీ.. కారణమేంటంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నిత్యం వివాదాల ద్వారా, సినిమాల ద్వారా వార్తల్లో నిలుస్తుంటారు రామ్ గోపాల్ వర్మ.దర్శకత్వం వహిస్తున్న సినిమాలన్నీ డిజాస్టర్లు అవుతున్నా తన కొత్త సినిమాలకు ఏదో ఒక విధంగా హైప్ తీసుకురావడం ఆర్జీవీ ప్రత్యేకత.

 Director Ram Gopal Varma Shifts His Base To Goa, 12 O Clock, Director Ram Gopal-TeluguStop.com

లాక్ డౌన్ సమయంలో కూడా సినిమాలు తీసి ఏటీటీల ద్వారా రిలీజ్ చేసి విజయాలు సొంతం చేసుకోలేకపోయినా పెట్టుబడికి రెట్టింపు లాభాలను మాత్రం ఆర్జీవీ అందుకున్నారు.

అయితే గత కొన్నేళ్లుగా హైదరాబాద్ కే పరిమితమైన ఆర్జీవీ నగారాన్ని వీడి గోవాకు మకాం మార్చారని తెలుస్తోంది.

ఇకపై ఆర్జీవీ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలన్నీ గోవాలోనే తెరకెక్కున్నాయని సమాచారం.గోవాలో సినిమా షూటింగ్ లు చేయడం ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీకి మళ్లీ దగ్గర కావాలని ఆర్జీవీ ప్రయత్నిస్తున్నారని సమాచారం.

గోవా నుంచి ఆర్జీవీ హిందీ కంటెంట్ ను ప్రొడ్యూస్ చేయడంతో పాటు డైరెక్టర్ గా కూడా వ్యవహరించనున్నారని తెలుస్తోంది.

Telugu Clock, Ram Gopal Varma, Shifts Goa-Movie

అగ‌స్త్య‌మంజు, తన సిబ్బంది సహాయంతో తెలుగులో కూడా ఆర్జీవీ కొన్ని సినిమాలను నిర్మించాలని ప్లాన్ చేస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.ఆర్జీవీ గోవాలో కొన్ని విల్లాలను లీజు పద్ధతిలో తీసుకున్నారని తెలుస్తోంది.వర్మతో పాటు మరికొందరు దర్శకనిర్మాతలు సైతం గోవాలో లీజు పద్ధతిలో విల్లాలను తీసుకుంటున్నారని సమాచారం.

గోవాకు మకాం మార్చిన ఆర్జీవీ భవిష్యత్తులో ఎలాంటి సినిమాలను తెరకెక్కించనున్నారో, నిర్మించనున్నారో చూడాల్సి ఉంది.

ఇప్పటివరకు ముంబై, హైదరాబాద్ కేంద్రాలుగా సినిమాలు తెరకెక్కించిన వర్మ గోవాకు మకాం మార్చడం గురించి నెటిజన్లు ఆర్జీవీ ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికీ అర్థం కాదని కామెంట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ 12 o clock అనే సినిమాను ఆర్జీవీ హిందీలో తెరకెక్కిస్తున్నారు.వరుస ఫ్లాపులతో నిరాశకు గురి చేస్తున్న ఆర్జీవీ మళ్లీ బ్లాక్ బస్టర్ హిట్ ఎప్పుడు అందుకుంటారో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube