వాట్సాప్ డెస్క్ టాప్ వినియోగదారులకు శుభవార్త..! ఇకపై కొత్త ఆప్షన్స్ అందుబాటులోకి..?!

ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన భాగమైన వాట్సాప్ సంవత్సరాలు గడుస్తున్నా కొద్దీ తమ వినియోగదారులకు సరికొత్త ఫ్యూచర్ లను అందుబాటులోకి తెస్తోంది.ఈ ఫ్యూచర్ల కారణంగా వినియోగదారులకు ఇతరులతో సంభాషించడానికి చాలా సులభం అవుతుంది.

 Whatsapp To Make Voice And Video Calls On Desktop, Whatsapp Desktop Users, Deskt-TeluguStop.com

ఇప్పటివరకు కేవలం మొబైల్ వెర్షన్ కే సరి కొత్త అప్డేట్స్ ని అందించిన వాట్సాప్ సంస్థ ఇకపై వెబ్ వాట్సాప్ వెర్షన్ కి కూడా కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్లను అప్డేట్ చేయబోతోంది.ముఖ్యంగా ఆడియో కాలింగ్, వీడియో కాలింగ్ ఫీచర్లను వెబ్ వెర్షన్ వాట్సాప్ కి అందించనుంది.

ఇప్పటివరకూ వీడియో కాల్ చేసుకునే వెసులుబాటు కల్పించక పోయేసరికి డెస్క్టాప్ యూజర్లు వాట్సాప్ సంస్థకు విజ్ఞప్తి చేస్తున్నారు.స్కైప్ వంటి డెస్క్ టాప్ సాఫ్ట్ వేర్ ల కంటే వాట్సాప్ వెబ్ వెర్షన్ లో వీడియో కాల్స్, ఆడియో కాల్స్ చేయడం చాలా సులభం అని వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు.

అందుకే వారికోసం అతి త్వరలోనే వీడియో, ఆడియో కాల్స్ ఫెసిలిటీ కల్పించడానికి వాట్సాప్ సంస్థ సిద్ధమైందని ఒక ప్రముఖ టెక్నాలజీ వెబ్సైట్ వెల్లడించింది.అయితే ఫస్ట్ టెస్టింగ్ చేయడానికి వాట్సాప్ సంస్థ వీడియో, ఆడియో కాలింగ్ ఫీచర్లను రోల్ అవుట్ చేస్తుందట.

ఇప్పటికే బీటా వినియోగదారులకు వీడియో, ఆడియో కాలింగ్ బటన్ కనిపిస్తున్నట్టు తెలుస్తోంది.

Telugu Desktop, Whats-Latest News - Telugu

అయితే ఈ వీడియో ఆడియో కాల్స్ కలవడానికి ఫోన్ దగ్గర ఉండాలి.ఈ ఫీచర్ ఎలా పని చేస్తుందో చూపించడానికి ఓ ప్రముఖ వెబ్ సైట్ కొన్ని స్క్రీన్ షాట్స్ కూడా విడుదల చేసింది.వాట్సాప్ కాల్స్ ని పొందొచ్చు, తిరిగి ఇతరులకు ఫోన్ చేసుకోవచ్చు అని స్క్రీన్ షాట్ ని బయటపెట్టి కొంత సమాచారాన్ని వెల్లడించింది.

ఎవరైనా కాల్ చేయగానే మనకి ఆటోమేటిక్ గా వేరొక విండో ఓపెన్ అవుతుంది.ఆ విండో లో వాట్సాప్ కాల్ యొక్క స్టేటస్ గమనించవచ్చు.డెస్క్ టాప్ వాట్సాప్ నుంచి గ్రూప్ కాల్స్ కూడా చేసుకోవచ్చట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube