సాధారణంగా ప్రతి ఇంట్లో ఎవరో ఒకరి గురక పెట్టి గుర్రుగా పడుకునే అలవాటు ఉంటుంది.గురక ఒక నార్మల్ సమస్యే అయినప్పటికీ.
చాలా ఇబ్బందిగా ఉంటుంది.ముఖ్యంగా గురక పెట్టే వారికంటే.
పక్కన ఉండే వారికి నిద్ర పట్టక నరకం కనిపిస్తుంటుంది.ఇక ఈ గురక సమస్య వల్ల విడిపోయిన భార్యాభర్తలూ ఉన్నారు.
ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు.అవును, వినడానికి విచిత్రంగా ఉన్నా ఇవి నిజం.
అలాంటి పరిస్థితి మీకు రాకూడదంటే.గురకను నివారించుకోవడం చాలా అవసరం.
అయితే ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్న తేనె గురకను నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.గురకతో ఇబ్బంది పడుతున్న వారు ప్రతి రోజు నిద్రించే ముందు ఒక స్పూన్ తేనె తీసుకోవాలి.
ఇలా చేయడం వల్ల శ్వాసనాళంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా చేసి గురక రాకుండా నివారిస్తుంది.అలాగే తేనె తీసుకోవడం వల్ల గొంతు వాపు, గొంత నొప్పి వంటి సమస్యలను కూడా దూరం చేస్తుంది.
ఇక తేనెతో కాదు.మరికొన్ని విధాలుగా కూడా గురకను నివారించుకోవచ్చు.
యాలికులు కూడా గురక సమస్యను నివారించడంలో గ్రేట్‌గా సహాయపడతాయి.ప్రతి రోజు నిద్రించే ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో అర టీ స్పూన్ యాలికుల పొడి కలుపుకుని సేవించాలి.
ఇలా చేయడం వల్ల కూడా గురక రాకుండా ఉంటుంది.అలాగే పసుపుతో కూడా గురకకు చెక్ పెట్టవచ్చు.
గోరు వెచ్చని పాలలో కొద్దిగా పసుపు కలిపి తీసుకోవాలి.ఇలా చేయడం వల్ల శ్వాసనాళాలను శుభ్రం చేసి.గురక సమస్యను నివారిస్తుంది.అలాగే నిద్రించే ముందు ఆవిరి పట్టడం వల్ల కూడా గురకను నివారించుకోవచ్చు.
ఇక గురక రాకుండా ఉండాలంటే ధూమపానం, మద్యపానం వంటి వాటికి దూరం ఉండాలి.అలాగే నిద్రించే ముందు ఆయిల్ ఫుడ్స్, ఇతర స్నాక్స్ వంటివి కూడా తీసుకోరాదు.
ఎందుకంటే, వీటి వల్ల గురక సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది.