18 పేజెస్ షూటింగ్ స్టార్ట్ చేసిన హీరో నిఖిల్

యంగ్ హీరో నిఖిల్ రొటీన్ కి భిన్నంగా డిఫరెంట్ కంటెంట్ కథలతో ఎప్పటికప్పుడు తనని కొత్తగా ఆవిష్కరించుకుంటూ ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు.నిఖిల్ చివరిగా అర్జున్ సురవరం సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి హిట్ కొట్టాడు.

 Hero Nikhil Started 18 Pages Movie Shooting, Tollywood, Sukumar, Geeta Arts 2, A-TeluguStop.com

ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న కొన్ని కారణాల వలన రిలీజ్ కాకుండా ఆగుతూ వచ్చిన ఆ సినిమా మీద నిఖిల్ కూడా ఆశలు వదిలేసుకున్నాడు.అలంటి టైంలో రిలీజ్ అయ్యి ఎలాంటి అంచనాలు లేకుండా హిట్ టాక్ తెచ్చుకుంది.

దీని తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి వరుసగా రెండు సినిమాలు లైన్ లో పెట్టాడు.కార్తికేయ 2ని అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు.

అలాగే గీతా ఆర్ట్స్ 2, సుకుమార్ రైటింగ్స్ నిర్మాణంలో 18 పేజెస్ సినిమా కూడా కన్ఫర్మ్ చేశారు.ఇంతలో కరోనా లాక్ డౌన్ తో అంతా సైలెంట్ అయిపోయింది.

లాక్ డౌన్ కాలంలోనే తన ప్రియురాలితో పెళ్లి పీటలు ఎక్కిన నిఖిల్ కొత్త జీవితం స్టార్ట్ చేశాడు.
మరలా ఫ్రెష్ గా లాక్ డౌన్ తర్వాత సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాడు.18 పేజెస్ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో స్టార్ట్ అయ్యింది.కుమారి 21 ఎఫ్ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ ఈ సినిమాకి దర్శకుడు.

అలాగే సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే ఈ సినిమాకి అందిస్తూ ఉండటం ప్రత్యేకత.ఇదిలా ఉంటే ఈ సినిమాలో నిఖిల్ కి జోడీగా మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది.

ఈ మధ్య కాలంలో కెరియర్ పరంగా వెనుకపడ్డ అనుపమకి మరల 18 పేజెస్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం వచ్చింది.ఈ సినిమా షూటింగ్ కి సంబందించి ఫోటోలు రివీల్ చేసి చిత్ర యూనిట్ ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయినట్లు ప్రకటించారు.

మరి మెమొరీ లాస్ యువకుడు లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా నిఖిల్ కి ఎంత వరకు హిట్ ఇస్తుంది అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube