కామెడీ చేయబోతే బ్రహ్మాజీని ఏకంగా తెలంగాణ ద్రోహిని చేసేశారు

హైదరాబాద్ లో తుఫాన్ ప్రభావం ఎంత విధ్వంసం సృష్టించిందో అందరికి తెలిసిందే.చాలా ఏరియాలు మునిగిపోయి ఇప్పటికి నీటిలోనే ఉన్నాయి.

కార్లు కొట్టుకుపోయాయి.మనుషులు కూడా కొట్టుకుపోయారు.

ఈ ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందొ అంచనా వేయడానికి మరికొంత కాలం పట్టేలా ఉందే.అత్యంత ఖరీదనైనా ప్రాంతాలుగా చెప్పుకునే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లాంటి, మణికొండ లాంటి ప్రాంతాలు కూడా మునిగిపోయాయి.

బురద నీటిలో ఉన్నాయి.మూడు అడుగుల మేర నీరు వచ్చేసింది.

Advertisement

ఈ స్థాయిలో హైదరాబాద్ లో వరద భీభత్సం సృష్టించడం ఇప్పటివరకు ఎవరూ చూడలేదు.అయితే ఈ విలయతాండవం అంతటికి గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణమని, చెరువులు కబ్జా చేసి ఇల్లు కట్టేయడం వలనే ఇదంతా జరిగిందని ఇప్పుడు మాట్లాడుతున్నారు.

ఇదిలా ఉంటే ఈ హైదరాబాద్ వరదల మీద నటుడు బ్రహ్మాజీ కామెడీ చేద్దామని సోషల్ మీడియాలో ఫన్నీగా ట్వీట్ చేశారు.ఆయన మోటార్ బోటు కొనుక్కోవాలని అనుకుంటున్నానని, దీనికోసం ఎవరైనా మంచి సలహా ఇవ్వాలని ట్వీట్ చేశాడు.

నిజానికి ఆయన మాటలు హైదరాబాద్ లో పరిస్థితిని అద్దం పెట్టె విధంగా ఉన్నాయి.అయితే ఈ వాఖ్యలు తెలంగాణ వాసులకి అస్సలు రుచించలేదు.

బ్రహ్మాజీ వాఖ్యలు కించపరిచే విధంగా ఉన్నాయని అతని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.ఏకంగా తెలంగాణ ద్రోహి అంటూ ముద్ర వేసేశారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

అయితే ట్రోలింగ్ మొదలైన కొద్ది సేపటికే తన ట్వీట్ తొలగించిన జరగాల్సిన నష్టం జరిగిపోయింది.సోషల్ మీడియాలో అతని మీద దాడి చేయడం మొదలు పెట్టారు.

Advertisement

దీంతో ఏమీ చేయలేక అకౌంట్ ని డిలేట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.వరదల వలన తమ అపార్ట్ మెంట్ లోకి నీళ్లు వచ్చాయని, సెల్లార్ లో కారు పార్కింగ్ చేయడానికి కూడా వీలు లేకపోవడంతో మరో అపార్ట్ మెంట్ కి వెళ్లాల్సి వచ్చిందని, దీనిని దృష్టిలో ఉంచుకొని ఈ కామెంట్స్ చేశానని బ్రహ్మాజీ తెలియజేసిన జరగాల్సిన నష్టం మాత్రం అతనికి జరిగిపోయింది.

తాజా వార్తలు