తెలుగులో ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించినటువంటి “హ్యాపీడేస్’ అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోగా పరిచయం అయిన యంగ్ హీరో “వరుణ్ సందేశ్” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే వచ్చీరావడంతోనే వరుణ్ సందేశ్ హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం, కుర్రాడు, తదితర చిత్రాలతో ప్రేక్షకులను మొదట్లో బాగానే ఆకట్టుకున్నప్పటికీ ఆ తర్వాతి చిత్రాల కథల విషయంలో కొంత మేర అవగాహన లోపించడంతో వరుస పరాజయాలను మూటగట్టుకున్నాడు.
దీంతో ఆ మధ్య సినిమా అవకాశాలు లేక ఎక్కువ కాలం ఇంటి వద్దనే గడిపాడు. కానీ గత ఏడాది బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొని మళ్లీ ప్రేక్షకులను బాగానే అలరించాడు.
అయితే ఈ మధ్యకాలంలో వరుణ్ సందేశ్ సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు అందుబాటులో ఉంటున్నాడు. అయితే తాజాగా తాను చిన్నప్పుడు కరాటే నేర్చుకుంటున్నటువంటి సమయంలో తీసినటువంటి ఓ ఫోటోని సోషల్ మీడియా షేర్ చేశాడు.
అంతేగాక ఈ ఫోటోకి కరాటే కిడ్ అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు.దీంతో ప్రస్తుతం వరుణ్ సందేశ్ చిన్నప్పటి ఫోటో సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతోంది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే తెలుగులో టాలీవుడ్ యంగ్ హీరో సుధాకర్ కోమకల హీరోగా నటించినటువంటి “నువ్వు తోపురా” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించాడు. అయితే ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడడంతో వరుణ్ సందేశ్ కి తీవ్ర నిరాశ మిగిలింది.
కాగా ప్రస్తుతం తెలుగులో వరుణ్ సందేశ్ ట్విస్ట్ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులు మొదలు కావాల్సి ఉండగా కరోనా వైరస్ కారణంగా కొంతకాలం పాటు వాయిదా వేసినట్లు సమాచారం.