టాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోలకు అమ్మగా నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన సీనియర్ నటి మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ నటి పవిత్ర లోకేష్ గురించి సినీ పరిశ్రమలో తెలియని వారుండరు.అయితే ఈమె మొదటగా కన్నడ సినీ పరిశ్రమలో తన సినీ ప్రస్థానాన్ని మొదలు పెట్టినప్పటికీ తెలుగులో మాత్రం నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
అయితే ఇటీవలే పవిత్ర లోకేష్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇందులో భాగంగా తన సినీ జీవితం గురించి పలు ఆసక్తికర అంశాలను ప్రేక్షకులతో పంచుకుంది.
అయితే ఇందులో భాగంగా సీనియర్ నటుడు అంబరీష్ తనని సినిమా పరిశ్రమకి నటిగా పరిచయం చేశాడని తెలిపింది.
అయితే మొదట్లో చాలా బాగుండేదని కానీ తనకి సినీ అవకాశాలు తగ్గిపోయినప్పటినుంచి పలు ఇబ్బందులను ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది.అంతేగాక ఒకానొక సమయంలో సినీపరిశ్రమలో వదిలేసి ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం కూడా చేశానని కానీ మళ్లీ తనకు తెలిసిన వారి ద్వారా సినిమాల్లో నటించే అవకాశాలు రావడంతో తన ఉద్యోగానికి రాజీనామా చేసి సినిమాల వైపు వచ్చానని తెలిపింది.
అంతేగాక అప్పట్లో తన పర్సనాలిటీ చూసి తనకు సరిపోయే పాత్రలు ఇచ్చేవారు కాదని కానీ తన నటన ప్రతిభను చూసిన కొందరు దర్శక నిర్మాతలు మాత్రం పిలిచి మరీ అవకాశాలు ఇచ్చేవారని చెప్పుకొచ్చింది.
అంతేగాక క్యాస్టింగ్ కౌచ్ విషయం పై కూడా స్పందిస్తూ క్యాస్టింగ్ కౌచ్ అనేది సినిమా పరిశ్రమలోనే కాక ప్రతి రంగం లోనూ ఉంటుందని కానీ ఈ సమస్యను ఎదుర్కొనే సమయంలో మనం ఎలా స్పందిస్తామనేది చాలా ముఖ్యం అని అభిప్రాయం వ్యక్తం చేసింది.
అంతేగాక ఏదో ఒక ప్రయోజనం ఆశించి కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ ప్రయోజనం పొందలేక పోతే అది క్యాస్టింగ్ కౌచ్ కాదని కూడా పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేసింది.అయితే ఈ విషయం ఎలా ఉండగా ప్రస్తుతం నటి పవిత్ర లోకేష్ పలు టాలీవుడ్ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పనిచేస్తోంది.