వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన ‘పవర్ స్టార్’ చిత్రంపై తారా స్థాయిలో చర్చ జరిగింది.వర్మ తీసిన సినిమా పవన్‌కు వ్యతిరేకంగానే ఉంటుందని ఖచ్చితంగా వర్మ పవన్ ను టార్గెట్ చేసి తీశాడు అంటూ చాలా మంది విమర్శలు గుప్పించారు.
ఇలాంటి సమయంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవర్ స్టార్ చిత్రం ప్రేక్షకులను పెద్దగా సర్ ప్రైజ్ చేయలేదు.ట్రైలర్‌లో చూపించిందే ఇంకాస్త డెప్త్‌గా చూపించాడు.
అయితే చివరి పది నిమిషాలు మాత్రం వర్మ తాను పవన్‌కు చెప్పాలనుకున్నది చెప్పాడు.
సినిమా దాదాపుగా నలబై నిమిషాలు ఉంటే మొదటి 30 నిమిషాలు కూడా పవన్ కళ్యాణ్ గురించి ఆయన సన్నిహితులు కుటుంబ సభ్యుల గురించి చూపించాడు.
ఎన్నికల్లో బాధపడటంపై ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు ఒక పాటను కూడా చూపించాడు.త్రివిక్రమ్.బండ్ల గణేష్.చిరంజీవి ఇలా కొన్ని పాత్రలను చూపించే ప్రయత్నం చేశాడు.
వాటి గురించి పెద్దగా మాట్లాడుకునేది ఏమీ లేదు.కాని చివరకు వర్మ మాట్లాడిన మాటలు కాస్త ఆలోచనాత్మకంగా ఉన్నాయి.
పవన్ అంటే నాకు అభిమానం అని, అయితే ఆయన తన చుట్టు ఉన్న వారి వల్ల చెడు మార్గంలో వెళ్తున్నాడంటూ వర్మ అభిప్రాయం వ్యక్తం చేశాడు.దర్శకుడు వర్మ సుదీర్ఘంగా పవన్‌కు క్లాస్ పీకడం, ఆ క్రమంలో పవన్ పాత్ర కాళ్ల వద్ద వర్మ కూర్చోవడం, వర్మను పవన్ తన్నినట్లుగా చూపించడం.
చివర్లో పవన్ పాత్ర నీవు చెప్పింది నిజమే అన్నట్లుగా వర్మను గట్టిగా కౌలిగించుకోవడం అందరికి ఆశ్చర్యంగా అనిపించింది.