ప్రస్తుతం ఏపీ అధికార పార్టీ వైసీపీలో మంత్రి పదవుల విషయంపై పెద్ద ఎత్తున హడావుడి జరుగుతోంది.ఇప్పటికే రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఈ ఇద్దరూ తమ మంత్రి పదవులకు రాజీనామా చేయనున్న నేపథ్యంలో జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తిగా మారింది.
అసలు ఈ రెండు మంత్రి పదవులు భర్తీ చేసే విషయంలో జగన్ దేనిని ప్రాతిపదికగా తీసుకుంటారు అనేది క్లారిటీ లేకపోవడంతో రకరకాల విశ్లేషణలు ప్రారంభమయ్యాయి.రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇద్దరూ ఇంకా తమ మంత్రి పదవులకు రాజీనామా చేయలేదు.
చేసిన తర్వాతే వీటి భర్తీ విషయమై జగన్ నిర్ణయం తీసుకుంటారు.కాకపోతే జగన్ కులాన్ని ప్రాతిపదికగా తీసుకుంటారా లేక ప్రాంతాన్ని ప్రాతిపదికగా తీసుకుంటారా ? సీనియారిటీని తీసుకుంటారా ? అనే లెక్కలు బయటకు వస్తున్నాయి.
పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ ఇద్దరూ బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు.దీంతో కొత్త మంత్రులను కూడా వారి సామాజిక వర్గానికి చెందిన వారిని ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది.
ఒకవేళ అలా కుదరని పక్షంలో వారి వారి జిల్లాలకు చెందిన వారికి మంత్రి పదవులు కేటాయించే ఛాన్స్ ఉందట.కొత్త వారికి అవకాశం కల్పిస్తారా అనేది ఆసక్తిగా మారింది.
మోపిదేవి వెంకటరమణ, గుంటూరు జిల్లాకు చెందిన వారు జిల్లాలో మంత్రి పదవులు ఆశిస్తున్నవారి సంఖ్య ఎక్కువగానే ఉంది.ఈ జిల్లాలో జగన్ కు అత్యంత సన్నిహితమైన వారు పార్టీకి వెన్నుదన్నుగా నిలబడుతున్న వారు చాలా మందే ఉన్నారు.
ముఖ్యంగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజిని ఇలా చాలా మంది మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు.బీసీ సామాజిక వర్గాన్ని లెక్కలోకి తీసుకుంటే విడదల రజనీ కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.అలాకాకుండా సీనియార్టీ, విధేయతకు ప్రాధాన్యం ఇవ్వాలంటే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి అవకాశం కనిపిస్తోంది.ఇక తూర్పు గోదావరి జిల్లా విషయానికి వస్తే పిల్లి సుభాష్ చంద్రబోస్ డిప్యూటీ సీఎంగా, మార్కెటింగ్ శాఖ మంత్రిగా ఉన్నారు.
ఈమె స్థానంలో ఎవరిని నియమించాలనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు.ఇదే జిల్లాకు చెందిన కురసాల కన్నబాబు మంత్రి గా ఉన్నారు.సామాజిక వర్గం లెక్కలోకి తీసుకుంటే చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ కు అవకాశం దక్కే ఛాన్స్ ఉంది.అలా కాకుండా ఇతర జిల్లాలకు చెందిన సీనియర్ నాయకులను పరిగణలోకి తీసుకుంటే ధర్మాన ప్రసాదరావు, కొలుసు పార్థసారథి, ఆర్ కే రోజా తో పాటు మరి కొంత మంది పేర్లు ప్రాతిపదికన తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
ఇవే అంశాలపై జగన్ కూడా పూర్తిగా కసరత్తు చేస్తున్నట్లు వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది.