పండగకే వస్తోన్న ప్రేమకథ.. ఈసారైనా ఫిక్సేనా?

టాలీవుడ్‌లో ఫీల్ గుడ్ చిత్రాలను తెరకెక్కిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న శేఖర్ కమ్ముల ప్రస్తుతం లవ్ స్టోరి అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్న శేఖర్ కమ్ముల, ఈ సినిమాతో మరోసారి తన సక్సెస్ ట్రాక్‌ను అందుకోవాలని చూస్తున్నాడు.

 Love Story Movie To Release During Dussehra, Naga Chaitanya, Love Story, Sai Pal-TeluguStop.com

ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య, ఫిదా బ్యూటీ సాయి పల్లవి జంటగా నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

కాగా ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యి రిలీజ్‌కు రెడీ అయ్యింది.

అయితే ఈ సినిమా రిలీజ్ కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.దీంతో ఈ సినిమాను లాక్‌డౌన్ పూర్తవ్వగానే రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

అయితే ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఈ సినిమాను ఇప్పట్లో రిలీజ్ చేసే అవకాశం లేదని తెలుస్తోంది.ఈ సినిమాను ఆగస్టులో కాకుండా దసరా కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

దీంతో పండగకే ఈ సినిమాను రిలీజ్ చేసి ప్రేక్షకుల ముందుకు వదలాలని చిత్ర యూనిట్ భావిస్తుంది.దసరా వరకు కరోనా భయం ప్రజల్లో పోతుందని, థియేటర్లు కూడా తెరుచుకుంటాయని దర్శకనిర్మాతలు అంటున్నారు.

మరి ఈ విషయంలో శేఖర్ కమ్ముల ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది వేచి చూడాల్సిందే.ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్స్, ఇప్పటికే ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ కావడంతో ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర యూనిట్ అంటోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube