మహారాష్ట్రలో కరోనా విలయతాండవం... 24 గంటల్లో 1200 కేసులు

మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభిస్తుంది.కరోనా కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేసి ప్రజలలో ఉన్న నిర్లక్ష్యం కారణంగా ఈ వైరస్ చాపక్రింద నీరులా వ్యాపించేసింది.

 Carona Cases In Maharashtra, Corona Effect, Lock Down, Mumbai-TeluguStop.com

ఎంత నియంత్రించిన కరోనా లక్షణాలు ఉన్నవారు ప్రభుత్వం గుర్తించే వరకు బయటకి రాకపోవడంతో వారి నుంచి మరికొంత మందికి వైరస్ వ్యాప్తి చెందుతుంది.ఈ ప్రభావం ఇప్పుడు మహారాష్ట్ర సర్కార్ కి నిద్ర లేకుండా చేస్తుంది.

రోజు రోజుకి వందల సంఖ్యలో కేసుల సంఖ్య పెరిగిపోతూ ఉన్నాయి.అసలు నియంత్రణ కనిపించడం లేదు.

దేశం వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 50 వేలు దాటిపోయింది.

ఇక మహారాష్ట్రలో గత 24 గంటల్లో ఏకంగా 1,233 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 16,758కి పెరిగింది.

అలాగే, గత 24 గంటల్లో 34 మంది మరణించారు.దీంతో మరణాల సంఖ్య 651 చేరుకుంది.

కరోనాకు దేశంలో ముంబై కేంద్ర బిందువుగా మారింది.ముంబైలో కేసుల సంఖ్య 10 వేలు దాటింది.

ఇక్కడ ఒక్క రోజే 769 కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.ఇక ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

ఈ నేపధ్యంలో రాష్ట్రంలో లాక్ డౌన్ ఆంక్షలు మరింత కఠినతరం చేసే దిశగా మహారాష్ట్ర సర్కార్ ఆలోచన చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube