పెళ్లి చేసుకోవడం కంటే అలా చేయడం బెటర్ అంటున్న హీరోయిన్...

ఈ మధ్య కాలంలో బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా ఏదో ఒక విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియా లో తరుచూ వార్తల్లో నిలుస్తోంది.ఇటీవల కాలంలో నీనా గుప్తా “నా అనుభవంతో చెబుతున్నాను పెళ్లైన వాళ్ళ తో ఎఫైర్ పెట్టుకోకండి” అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు నెట్టింట్లో బాగానే వైరల్ అయ్యాయి.

 Neena Gupta Sensational Comments On Marriage-TeluguStop.com

అయితే ఇప్పుడు తన కూతురు మసాబా కాపురం విషయంపై చేసినటువంటి పలు సంచలన వ్యాఖ్యలు నెట్లో మళ్ళీ హల్చల్ చేస్తున్నాయి.

తాజాగా నీనా గుప్తా ఓ ప్రముఖ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూలో పాల్గొంది.

ఇందులో భాగంగా తన జీవితంలో చోటు చేసుకున్నటువంటి కొన్ని ముఖ్య సంఘటనలను ప్రేక్షకులతో పంచుకుంది.అయితే ఇందులోతన కన్న కూతురు మసాబా ఈ మధ్య కాలంలో కొన్ని వ్యక్తిగత కారణాల కారణంగా తన భర్తతో విడిపోయింది.

దీంతో నీనా గుప్తా మానసికంగా కృంగి పోయానని చెప్పుకొచ్చింది.అయితే ఆ సమయంలో తన కూతురే తనకు అండగా నిలిచి ధైర్యం చెప్పిందని అన్నారు.మరో పక్క తన జీవితం లాగే తన కూతురు జీవితం కూడా అవుతుందోనని నిత్యం భయపడుతూనే ఉంటానని అన్నారు.

Telugu Bollywood, Neena Gupta-Movie

అంతేగాక ఎంత ఖర్చు పెట్టి పెళ్లి చేసినప్పటికీ భార్యాభర్తల మధ్య సఖ్యత లేనప్పుడు ఆ కాపురం ఎంతో కాలం నిలబడదని అన్నారు.అలాగే క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోలేక విడిపోయే నిర్ణయాన్ని తీసుకునే మనస్తత్వం ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకోవడం కంటే సహజీవనం చేయడమే మంచిదని అన్నారు.ఇలా చేయడం వల్ల ఎన్నో ఎమోషన్స్ మరియు ఆర్థిక పరమైన సమస్యలు తగ్గుతాయి అని చెప్పుకొచ్చింది నీనా గుప్తా.

అయితే ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

నీ జీవితం లాగే నీ కూతురు జీవితాన్ని కూడా పాడు చేయాలని చూస్తున్నావా నీనా అంటూ నేను నీనా గుప్తా పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరికొందరు మాత్రం భార్యాభర్తలన్నతర్వాత  ఇద్దరి మధ్య సమస్యలు వస్తాయని కాబట్టి సర్దిచెప్పి కూతురిని కాపురానికి పంపించాల్సింది పోయి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని నెటిజన్లు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube