అమరావతిలో పవన్‌కు 62 ఎకరాలు నిజమా?

తెలుగు దేశం పార్టీ అమరావతిని రాజధానిగా ప్రకటించబోతుంది అంటూ వార్తలు వచ్చిన సమయంలో కర్నూలు రాజధాని అయితే బాగుంటుందని, మళ్లీ హైదరాబాద్‌ మాదిరిగా అమరావతి అవుతుందనే అనుమానాలు పవన్‌ వ్యక్తం చేశాడు.కాని ఇప్పుడు అమరావతి రాజధానిగా కొనసాగించాల్సిందే అంటూ ఆందోళనలు చేస్తున్నాడు అంటూ వైకాపా నాయకులు ఎద్దేవ చేస్తున్నారు.

 Pawan Kalyan Had 62 Acaras In Amaravathi-TeluguStop.com

ఇంతలో పవన్‌లో ఎందుకు ఇంత మార్పు అంటూ సోషల్‌ మీడియాలో చాలా మంది చాలా రకాలుగా ప్రచారాలు చేస్తున్నాడు.ఈ సమయంలోనే ఈయనకు ఉన్న అమరావతి భూమి కారణంగానే ఈయన వర్షన్‌ మారిందంటూ కొందరు ఆరోపిస్తున్నారు.

అమరావతిలో పవన్‌ కళ్యాణ్‌ పేరు మీద 40 ఎకరాలు మరియు ఆయన తల్లి పేరు మీద 22 ఎకరాలు ఉన్నట్లుగా వైకాపా నాయకులు చెబుతున్నారు.అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా వారు చూపుతున్నారు.

ఈ 62 ఎకరాల భూమిని కాపాడుకునే ఉద్దేశ్యంతోనే పవన్‌ కళ్యాణ్‌ రాజధాని విషయంలో పోరాటం చేస్తున్నారని, అంతకు మించి ఏమీ లేదని, రాజధాని కర్నూలు అయితే బాగుంటుందని గతంలో చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఎందుకు కర్నూలు వద్దంటున్నాడు, వైజాగ్‌ అస్సలు వద్దంటున్నాడు అంటూ వైకాపా నాయకులు ప్రశ్నిస్తున్నారు.మరి పవన్‌ ఈ 62 ఎకరాల గురించి ఏమని స్పందిస్తాడో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube