రాజధాని విషయంలో వైసిపి అధినేత సీఎం జగన్ అనేక విమర్శలు ఎదుర్కొంటున్నారు.కేవలం చంద్రబాబు మీద ఉన్న కోపంతోనే ఆ సామాజిక వర్గం వారు అమరావతి చుట్టుపక్కల ఎక్కువగా ఉండడాన్ని జీర్ణించుకోలేక రాజధానిని మార్చేందుకు జగన్ సిద్ధమయ్యారు అనే విమర్శలు మూట కట్టుకుంటున్నారు.
జగన్ ప్రభుత్వంపై ఈ విషయంలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా జగన్ ప్రభుత్వం వెనకడుగు వేసే విధంగా కనిపించడం లేదు.అమరావతి విషయంలో జగన్ ను కార్నర్ చేస్తూ జనసేన టీడీపీ బీజేపీలు విమర్శలు చేయగా తాజాగా సిపిఐ నేత నారాయణ కూడా ఈ జాబితాలో చేరిపోయారు.
చంద్రబాబుపై ఉన్న కోపంతోనే జగన్ రాజధానిని మార్చేయాలని చూస్తున్నారని, ఈ విషయంలో ప్రజలు బలైపోతున్నారు అంటూ నారాయణ విమర్శించారు.రాజధాని విషయంలో ప్రభుత్వ విధానాలు సరికాదన్నారు.
మీ రాజకీయ కక్షలు రాష్ట్ర ప్రజలపై చూపించ వద్దంటూ నారాయణ వేడుకున్నారు.జియస్ రావు కమిటీ రాజధానిపై నియమించారని, అసలు ఆ కమిటీకి విలువ లేదంటూ నారాయణ చెప్పుకొచ్చారు.
వేర్వేరు ప్రాంతాల్లో పరిపాలన అనేది సాధ్యం కాదని, చంద్రబాబు చేసింది తక్కువ ప్రచారం ఎక్కువ చేసుకున్నారని నారాయణ విమర్శించారు.చంద్రబాబు, జగన్ ఇద్దరూ బరిలోకి దిగి కొట్టుకుంటే తాను కీపర్ గా ఉంటాను అంటూ నారాయణ వెటకారం చేశారు.