ఇటీవల సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచారం కేసులో నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు.సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తున్న పమయంలో నలుగురు నిందితులు పారిపోయే ప్రయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఆ సమయంలో వారిని ఎన్‌కౌంటర్ చేసినట్లు తెలుస్తోంది.
అయితే ఈ ఘటనకు సంబంధించిన అధికారిక ప్రకటన పోలీసులు చేయలేదు.
చటాన్‌పల్లి దగ్గర ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్యాచార కేసులో ప్రధాన నిందితులైన ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులు ఈ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు.
దిశ హత్య జరిగిన ప్రదేశంలోనే వీరిని ఎన్‌కౌంటర్ చేసినట్లు తెలుస్తోంది.
హత్యాచార నిందితులను ఉరి తీయాలని, లేదా ఎన్‌కౌంటర్ చేయాలని దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి.
ఈ క్రమంలో వారి ఎన్‌కౌంటర్‌తో దిశ ఉదంతంలో పూర్తి న్యాయం జరిగిందంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.