కన్న తల్లిని సొంత ఊరిని మర్చిపోకూడదు అంటారు.కన్న తల్లికి మనం ఎంతటి గొప్ప స్థానాన్ని ఇస్తామో పెరిగిన ఊరికి కూడా అంతే స్థాయిలో గౌరవం ,ప్రేమ ,ఆదరణ ఇవ్వాలి ఆ ఊరి అభివృద్దిలో పాలు పంచుకోవాలి.
ఇదే తరహా పని పెరిగిన ప్రాంతానికి ఎంతో దూరంగా ఉన్న వాళ్ళు ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటారు.అయితే ఈ క్రమంలోనే తమ సొంత ఊరికి కొంతమది ప్రజలు చేసిన సాయం మాత్రం మరువలేనిదని చెప్పాలి.
వివరాలలోకి వెళ్తే.
భారత ఎన్నారైలు ఎప్పటికప్పుడు వెనుకబడిన ప్రాంతాల అభివృద్దికి గానీ.ఫాటశాలల మరమ్మత్తులు లేదా నిర్మాణాల కోసం.పేద విద్యార్ధుల చదువులకోసం విరాళాలు ఇస్తూనే ఉంటారు.
అయితే ఈ క్రమంలోనే నల్గొండ జిల్లాకి చెందిన కొంతమంది ఎన్నారైలు అదే జిల్లాలో డ్వాబ్ అనే సంస్థ నిర్వహిస్తున్న అంధుల పాఠశాల నిర్వహణ ఖర్చుల నిమిత్తం లక్ష రూపాయల ఆర్ధిక సాయాన్ని ఇచ్చారు.
ఈ మేరకు ఆ సంస్థ వారికి ప్రత్యెక ధన్యవాదాలు తెలిపింది.
అడిగిన వెంటనే కాదని అనకుండా ఈ పాఠశాల కి సాయం చేయడానికి ముందుకు వచ్చిన ప్రవాసాంధ్రులు మేకల ప్రబోధ్ రెడ్డి, యల్క ప్రదీప్ రెడ్డి, కందకూరి శ్రీనివాసులకి ఈ సందర్భంగా డ్వాబ్ సంస్థ ప్రధాన కార్యదర్శి పొనుగోటి చొక్కారావు ముగ్గురు ప్రవాసీయులకి అభినందనలు తెలిపారు…అయితే తాము ఎన్నో సేవాకార్యక్రమాలు చేస్తున్నామని అదే క్రమంలో ఈ పాఠశాల గురించి తెలుసుకుని సాయం చేయడానికి ముందుకు వచ్చామని తెలిపారు ఎన్నారైలు.