జగన్ మోహన్ రెడ్డి తన పాదయత్రకి కొన్ని రోజులు బ్రేక్ ఇవ్వనున్నాడు.ఈ బ్రేక్ సమయంలో మోడీ ని కలవనున్నాడని సమాచారం.
అయితే అమిత్ షా ఏపీలో బీజేపి నేతలని కలుస్తున్న సమయంలోనే జగన్ మోడీ తో ములాకత్ కి ఏర్పాటు చేసుకోవడం ఇప్పుడు సంచాలనం కలిగిస్తోంది.అసలు కేంద్రం ఏం చేయాలని అనుకుంటోంది.
ఏం చేస్తోందో అసలు ఎవరికీ అంతుపట్టడం లేదు.ఇదిలా ఉంటే ఒక పక్క కేంద్రంలో పెద్దలు మాత్రం తమ తెలుగు రాష్ట్రాల నేతల్ని పిలిపించుకుని ప్రస్తుత పరిస్థితులపై ఒక సమగ్ర నివేదికని ఇవ్వమని కోరినట్టుగా తెలుస్తోంది.
అయితే టిడిపి –బీజేపి భంధం వీడిపోతున్న సమయంలో కనుకా జగన్ ఏ మాత్రం అలసత్వం చూపించినా సరే వచ్చిన మంచి అవకాశం మిస్ అవుతుందని హుటాహుటిన జగన్ పాదయత్రకి బ్రేక్ ఇచ్చి మరీ మోడీ దగ్గరకి వెళ్ళడానికి సిద్దం అయ్యాడు.
అయితే ప్రధానితో అపాయింట్మెంట్ విషయం చూడమని ఇప్పటికే విజయసాయి రెడ్డిని పురమాయించాడు జగన్…అయితే జగన్ తొందరపడేది ఎందుకంటే లోక్ సభకు ముందుస్తు ఎన్నికలు వస్తున్నాయి అంటున్న ఈ సమయంలో ఈలోగా అన్ని విషయాలు కొలిక్కి వచ్చేస్తే క్లారిటీ ఉంటుందని ప్రశాంత్ కిశోరే చెప్పడంతో జగన్ మోడీ కోసం వెయిట్ చేస్తున్నారు.
ఇదిలాఉంటే…గత కొంతకాలం నుంచీ వైసీపి నేతలు బీజేపి నేతలతో సన్నిహితంగా ఉండటం.టిడిపి నేతలపై బీజేపి నేతలు ఫైర్ అవడం చుస్తున్నాము కూడా…అంతేకాదు ఏకంగా వైసీపి నేతలతో కలిసి బీజేపి నేతలు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు…ఛాన్స్ దొరికితే చాలు టిడిపి నేతలపై విరుచుకు పడుతున్నారు.
ఈ నేపధ్యంలో, బీజేపీతో, జగన్ పొత్తు పై చర్చలు జరుపుతున్నారు అనే వార్తలు వస్తున్నాయి…జగన్ కి కూడా ఇదే అదునుగా తన పై కేసులని ఒక్కొక్కటిగా పక్కకి తప్పించేలా ప్లాన్ చేస్తున్నాడు.మరి జగన్ ,మోడీ భేటీలో ఇంకెన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడుతాయో వేచి చూడాలి.