మహా విష్ణువు అనగానే మనకు చేతిలో సుదర్శన చక్రం గుర్తు వస్తుంది.పురాణాల్లో శివుని చేతిలో త్రిసూలం,విష్ణువు చేతిలో చక్రం అత్యంత శక్తివంతమైనవి.
విష్ణు మూర్తి కుడి చేతి చూపుడు వేలుకి ఉండే ఈ సుదర్శన చక్రానికి ఎన్నో అద్భుతమైన శక్తులు ఉన్నాయి.ఈ సుదర్శన చక్రం విష్ణువుకు 1000 సంవత్సరాల తపస్సు ఫలితంగా లభించిందని పురాణాలూ చెపుతున్నాయి.
సుదర్శన చక్రంలో పదునైన బ్లెడ్ వంటి ఆకారాలు 108 ఉంటాయి.రెప్పపాటులో కొన్ని మిలియన్ యోజనాల దూరం ప్రయాణిస్తుంది.
ఒక యోజనం అంటే ఎనిమిది కిలోమీటర్లు.దీనిని కేవలం శత్రువు మీద మాత్రమే ప్రయోగించాలి.
ఒకసారి ప్రయోగించాక లక్ష్యం పూర్తీ అయ్యాకే వెనక్కి వస్తుంది.
పురాణాల ప్రకారం సుదర్శన చక్రం దాడి నుండి బయట పడాలంటే పరిగెత్తకుండా విష్ణువు శరణు వేడుకోవాలి.
శివుని గురించి విష్ణువు 1000 సంవత్సరాలు తపస్సు చేసి అసుర సంహారం కోసం తనకు శక్తివంతమైన ఆయుధం కావాలని కోరతారు.దాంతో శివుడు సుదర్శన చక్రాన్ని విష్ణువుకు అందిస్తారు.
అప్పటి నుంచి మహావిష్ణువు అన్ని అవతారాల్లోనూ కుడిచేతి చూపుడి వేలికి చక్రం ఉంటుంది.