ఆ ఇద్ద‌రు వైకాపా ఎమ్మెల్యేల అరెస్టు...!

ఏపీ ఏకైక విప‌క్షం వైకాపా అధినేత జ‌గ‌న్‌కి మ‌రో భారీషాక్ త‌గిలే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి.ఈ పార్టీకి చెందిన ఇద్ద‌రు కీల‌క ఎమ్మెల్యేల‌పై ఏపీ సీఐడీ ద‌ర్యాప్తు పూర్తి చేసింది.2014 నాటి ఎన్నిక‌ల స‌మ‌యంలో ఈ ఇద్ద‌రు ఎమ్మెల్యేలు త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో పంచిన మద్యం క‌ల్తీ జ‌రిగింద‌ని, ఫ‌లితంగా దీనిని తాగి.ఆరుగురు మృతి చెందార‌ని సీఐడీ అప్ప‌ట్లోనే కేసు న‌మోదు చేసింది.

 Case Filed Against Two Ycp Mlas-TeluguStop.com

అయితే, వీరిద్ద‌రు కోర్టు నుంచి అరెస్టుపై స్టే తెచ్చుకున్నారు.కానీ, ఇప్పుడు మాత్రం ద‌ర్యాప్తు పూర్తికి రావ‌డం, వీరిద్ద‌రిపైనా నేరాల‌కు సంబంధించి పూర్తిస్థాయిలో ఆధారాలు ల‌భ్యం కావ‌డంతో వీరిద్ద‌రి అరెస్టు ఖాయంగా క‌నిపిస్తోంది.

విష‌యంలోకి వెళ్తే.

నెల్లూరు జిల్లాకు చెందిన సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి.

కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాపకుమార్ రెడ్డిలు ఇద్దరూ వైకాపా నుంచి పోటీ చేసి గెలుపొందారు.అయితే, అప్ప‌టి ఎన్నికల్లో కల్తీ మద్యం పంపిణీ చేశారనే ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

ఎన్నికల సమయంలో చిత్తూరు.నెల్లూరు.

ప్రకాశం.గుంటూరు.

పశ్చిమ గోదావరి జిల్లాల్లో మొత్తం32 నకిలీ మద్యం కేసులు నమోదు అయ్యాయి.నకిలీ మద్యం తాగి ఆరుగురు మరణించారు.

కర్ణాటక.గోవా నుంచి గుట్టుగా తెప్పించిన మద్యంలో నాణ్యత సరిగా లేకపోవటంతో అది విషంగా మారింద‌ని, దీంతో దానిని తాగిన వారిలో ఆరుగురు మృతి చెందార‌ని అప్పట్లో ఆరోపణలు వినిపించాయి.

ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ‌కు రంగంలోకి దిగిన సీఐడీ.ఈ ఇద్ద‌రు ఎమ్మెల్యేల పాత్ర ఉన్న‌ట్టు నిగ్గు తేల్చింది.

అయితే, అప్ప‌ట్లో కోర్టు నుంచి తెచ్చుకున్న స్టే కారణంగా వీరి అరెస్ట్ సాధ్యం కాలేదు.తాజాగా.

సీఐడీ సేకరించిన ఆధారాలు.అభియోగాలు ఈ ఇద్ద‌రు ఎమ్మెల్యేల పాత్ర ఖ‌చ్చితంగా ఉంద‌నే విష‌యాన్ని వెల్ల‌డిస్తున్నాయ‌ట‌.

ఈ క్ర‌మంలో ఈ ఇద్ద‌రు ఎమ్మెల్యేల‌ను కోర్టు అనుమ‌తితో అరెస్టు చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.ఇదే జ‌రిగితే.

జ‌గ‌న్‌కి కోలుకోలేని దెబ్బ అని అంటున్నారు విశ్లేష‌కులు.ఈ కేసును రాష్ట్ర ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా తీసుకుని విచారిస్తున్న క్ర‌మంలో విప‌క్ష ఎమ్మెల్యేల అరెస్టు త‌థ్యం అనే మాటలు వినిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube