సినిమా ఇండస్ట్రీ అన్నాక పబ్లిసిటి చేసుకోవడం చాలా అవసరం.అసలు పబ్లిసిటి లేనిదే స్టార్ స్టేటస్ పొందడం కష్టం.
ఎందుకంటే ఫాలోయింగ్ కావాలంటే ప్రజలకు సాధించిన విజయాలు తెలియాలి.కాని ఏదో తెలుగు సినిమాలో అన్నట్లు “మనమే డబ్బారాయిళ్ళం అనుకుంటే, మనకంటే డబ్బారాయుడ్లా ఉన్నాడు” ఈ హీరో అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఆ హీరో ఇండస్ట్రీకి వచ్చి చాలాకాలమైంది.కాని ఇప్పటివరకూ సొంతంగా సంపాదించుకున్న ఫ్యాన్ బేస్ తక్కువే.
మరి జనాలు ఆయనవైపు ఎందుకు ఆకర్షితులు అవట్లేదు అంటే, ఆయన చేసే “అతి” వల్లేనేమో.టాలెంట్ ఉండి, సక్సెస్ ఉండి కూడా ఫ్యాన్స్ ఎక్కువగా లేరు అంటే అర్థం చేసుకోండి, ఆయన పబ్లిసిటి పిచ్చి, ఇతర హీరోలతో ప్రవర్తించే తీరు వలన ఎంత బ్యాడ్ నేమ్ ఉందో.
ఇది ఎంత దూరం వెళ్లింది అంటే, ఓ సినిమా నిజంగానే నాలుగు నోట్లు ఎక్కువ సంపాదించినా సరే, అందతా పబ్లిసిటి జిమ్మిక్ .ఆ హీరో పీఆర్ టీమ్ మీడియాని ఆటాడిస్తూ కొట్టించే డప్పు మనకు తెలియనిదా అని అంటున్నారు చాలామంది.సోషల్ మీడియా ఫాలోయింగ్ నుంచి బాక్సాఫీసు కలెక్షన్ల దాకా, అంతా ఆ పీఆర్ టీమ్ చేసే జిమ్మిక్కులే తప్పా, ఆ హీరో దగ్గర అంత విషయం ఎక్కడిది అంటూ ఎద్దేవా చేస్తున్నారు.అందుకే, మన డప్పు కొట్టుకోవాలి కాని, మరీ విసిగించేలా కొట్టి, ఒక్కోసారి నిజాల్ని కూడా జనం నమ్మలేని స్థాయిలో పడిపోకూడదు.