ట్రెండ్ మారుతున్నా కొద్ది సినిమాల్లో మార్పులు గమనిస్తూనే ఉంటాం.మొన్నటిదాకా ఇతర భాషల విలన్ల మీద మోజు పడ్డ మన దర్శక నిర్మాతలు ఇప్పుడు ఇక్కడ వారికే ప్రాముఖ్యత ఇస్తున్నారు.
ఇక హీరోల జాబితా ఎక్కువవడంతో కొందరు హీరోలు కెరియర్ ఎర్లీ స్టేజ్ లోనే ప్రతినాయకుడిగా మారుతున్నారు.ప్రస్తుతం విలన్ గా మారుతున్న జాబితా చాలా పెద్దదే అని చెప్పాలి.
ఆ క్రమంలో తనీష్ కూడా చేరిపోయాడు.చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించిన తనీష్ ఆ తర్వాత హీరోగా మారాడు.
కెరియర్ మొదట్లో హీరోగా హిట్లు అందుకున్న తనీష్ ఇప్పుడు రేసులో పూర్తిగా వెనుకపడ్డాడు.
ఇక కొద్దిరోజుల క్రితమే తన తండ్రి మరణించడంతో ఢీలా పడ్డ తనీష్ ఇప్పుడు విలన్ గా మారేందుకు సిద్ధమయ్యాడు.
సందీప్ కిషన్, రెజినా జంటగా నటిస్తున్న ‘నక్షత్రం’ సినిమాను కృష్ణవంశీ డైరెక్ట్ చేస్తున్నాడు.ఈ సినిమాలో విలన్ గా తనీష్ ను తీసుకున్నారని ఎక్స్ క్లూజివ్ న్యూస్.
చేతిలో సినిమాలేవి లేకపోవడంతో విలన్ గా అయినా తనీష్ ఓకే చెప్పడం విశేషం.అంతేకాదు కృష్ణవంశీ డైరక్షన్లో విలనిజం అంటే నిజంగా ఇదో గొప్ప అవకాశమని చెప్పాలి.
మరి వచ్చిన ఈ లక్కీ ఆఫర్ ను తనీష్ ఏ విధంగా వినియోగించుకుంటాడో కాని ఓరకంగా తనీష్ తీసుకున్న ఈ టర్న్ తన కెరియర్ కు మంచి బూస్టప్ ఇస్తుందని అనుకుంటున్నారు సిని జనాలు.
.