ఒక మనసు కోసం సమంత, రెజినా..!

మెగా డాటర్ నటించిన ఒక మనసుకి సమంత, రెజినాలకు సంబంధం ఏంటి అని మీ డౌట్ కదా.ఒకవేళ వారిద్దరూ ఇందులో గెస్ట్ రోల్ ఏమన్నా చేస్తున్నారా అన్న సందేహం వస్తుంది.

 Oka Manasu For Samantha And Regina-TeluguStop.com

మెగా డాటర్ నిహారిక వెండితెర తెరంగేట్రం చేస్తున్న సినిమా ఒక మనసు.యువ నటుడు నాగశౌర్య హీరోగా నటించిన ఈ సినిమాను రామరాజు డైరెక్ట్ చేయగా.

మధుర శ్రీధర్,టివి-9 కలిసి నిర్మించారు.ఈ నెల 24న రిలీజ్ అవబోతున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.

అయితే ఒక మనసు హీరోయిన్ పాత్రలో ముందు సమంతను అడిగి చూద్దమనుకున్నారట దర్శక నిర్మాతలు.ఒకవేళ సమంత కాకున్నా రెజినా అయినా సరే సినిమాకు మంచి క్రేజ్ వస్తుందని అనుకున్నారు.

కాని నిహారిక ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉన్నదని తెలుసుకున్న ఒక మనసు చిత్ర దర్శక నిర్మాతలు వెంటనే నాగబాబు, నిహారికలకు ఈ సినిమా కథ వినిపించారట.అంతేకాదు హీరోయిన్ పాత్ర యొక్క విశిష్టతను వివరంగా చెప్పాడట.

నాగబాబుకి కథ అటు ఇటుగా ఉన్నా నిహారికకు మాత్రం బాగా నచ్చేసిందట.హీరో ఉన్నా సరే ఒక మనసులో ఎక్కువగా హీరోయిన్ పాత్రకే ఇంపార్టెన్స్ ఉంటుందని నిహారిక ఈ ప్రాజెక్ట్ కు సైన్ చేసింది.

మరి నిహారిక అంత ఇష్టపడి చేసిన ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇచ్చిందో తెలుసుకోవాలంటే మరో మూడు రోజులు వెయిట్ చేయాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube