వెయ్యి కిలోమీటర్లు నడిచిన అగ్రహీరో

హీరోలందరిలో ఆమీర్ ఖాన్ స్టయిల్ వేరు.స్టార్ హీరో ఇమేజ్ ఉన్నా, బాక్సాఫీస్ రికార్డులు ఉన్నా, ఎదో ఉత్తి పుణ్యాన కమర్షియల్ సినిమాలు చేయకుండా, ప్రతీసారి ఎదో ఒక కొత్త రకమైన సినిమాను అందిచడమే కాదు, పాత్రకు తగ్గట్టుగా తనని తాను మలుచుకుంటూ ఉంటాడు.తన తదుపరి చిత్రం దంగల్ కోసం చాలానే కష్టపడ్డాడు ఆమీర్.

 Aamir Khan Walked 1000 Kms To Reduce Weight-TeluguStop.com

51 ఏళ్ళ ఆమీర్, మొదట ఈ చిత్రం కోసం లావుగా తయారయ్యి శ్వాస సంబంధిత ఇబ్బందులు ఎదురుకున్నాడు.ఇదే చిత్రంలో పాత్రలోని మరో కోణం కోసం మళ్ళీ బరువు తగ్గాడు.ఎలాంటి కృతిమ పద్ధతులు అనుసరించకుండా, వ్యాయామాలు, నడకతో కొవ్వు కరిగించాడు.గత నాలుగు నెలల్లో 1000 కిలోమీటర్లుకు పైగా నడిచాడట ఆమీర్.అందుకే మళ్ళీ కావాల్సిన షేప్ లోకి వచ్చేసాడు.

అంతే కాకుండా ఇప్పుడు కండలు మరింత పెంచుతున్నాడు.ఎన్ని కష్టాలో అగ్రహీరోలకి కూడా.

నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇదే ఏడాది క్రిస్టమస్ కానుకగా విడుదల కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube