ఎన్నారైలకు గుడ్ న్యూస్.. తల్లిదండ్రులను పర్మనెంట్ రెసిడెంట్స్‌గా కెనడాకు తీసుకెళ్లొచ్చు...

కెనడియన్ ప్రభుత్వం( Canadian Govt ) ఎన్నారైలకు గుడ్ న్యూస్ చెప్పింది.తమ తల్లిదండ్రులను కెనడాకు తీసుకొచ్చి శాశ్వత నివాసం అందించాలనుకునే భారతీయ ప్రవాసులతో సహా విదేశీయుల కోసం కొత్త ప్రోగ్రామ్‌ లాంచ్ చేయడానికి సిద్ధమయింది.2023, అక్టోబరు 10న పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ ప్రోగ్రామ్ ( PGP ) పేరుతో ఈ కొత్త ప్రోగ్రామ్‌ను ప్రారంభిస్తోంది.ఈ ప్రోగ్రామ్ కెనడియన్ పౌరులు, శాశ్వత నివాసితులు వారి తల్లిదండ్రులు, గ్రాండ్‌పేరెంట్స్‌ను శాశ్వతంగా కెనడాకు వచ్చేలా స్పాన్సర్ చేయడానికి అనుమతిస్తుంది.

 2023 Parents And Grandparents Sponsorship Program For Canada,canada,parents And-TeluguStop.com
Telugu Canada, Canadian, Sponsorship, Long Term Visa, Nri Visa, Program, Visa-Te

పీజీపీకి అర్హత పొందడానికి, స్పాన్సర్‌కు తప్పనిసరిగా 18 సంవత్సరాలు నిండి ఉండాలి.వారు కెనడియన్ పౌరులు, శాశ్వత నివాసి లేదా కెనడియన్ ఇండియన్ యాక్ట్ కింద నమోదిత భారతీయుడిగా ఉండాలి.కెనడాలో నివాసం, ప్రోగ్రామ్ కోసం మినిమమ్‌ నెసిస్సరీ ఇన్‌కమ్ లెవెల్ ( MNI )ని కలిగి ఉండాలి.2023లో పీజీపీ కోసం మినిమమ్‌ నెసిస్సరీ ఇన్‌కమ్ లెవెల్ అనేది ఒక్క స్పాన్సర్‌కు 35 వేల డాలర్లు కాగా ఒక జంట కోసం 50 వేల డాలర్లు ఉంటుంది.మినిమమ్‌ నెసిస్సరీ ఇన్‌కమ్ లెవెల్ అనేది స్పాన్సర్ కుటుంబ ఆదాయం, వారిపై ఆధారపడిన వారి సంఖ్యపై ఆధారపడి ఉంటుంది.
పీజీపీ 2023లో 15,000 స్పాన్సర్‌షిప్‌లు అందుబాటులో ఉంటాయి.

ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్, సిటిజెన్‌షిప్ కెనడా ( IRCC ) కోటా చేరే వరకు రోలింగ్ ప్రాతిపదికన దరఖాస్తు చేసుకోవడానికి ఆహ్వానాలను పంపుతుంది.పీజీపీకి ఎంపిక కాకపోతే, సూపర్ వీసా ప్రోగ్రామ్ ద్వారా తల్లిదండ్రులు లేదా తాతలను స్పాన్సర్ చేయవచ్చు.

సూపర్ వీసా అనేది లాంగ్ టర్మ్ విజిటర్ వీసా, ఇది తల్లిదండ్రులు, గ్రాండ్‌పేరెంట్స్ 10 ఏళ్ల వరకు కెనడాలో ఉండేందుకు వీలు కల్పిస్తుంది.సూపర్ వీసాకు అర్హత పొందేందుకు, స్పాన్సర్ తప్పనిసరిగా పీజీపీకి ఉన్న అవసరాలను తీర్చాలి, కానీ వారు MNIని చేరుకోవాల్సిన అవసరం లేదు.

Telugu Canada, Canadian, Sponsorship, Long Term Visa, Nri Visa, Program, Visa-Te

పీజీపీ అనేది రెండు-దశల ప్రక్రియ.ముందుగా, స్పాన్సర్‌గా మారడానికి స్పాన్సర్ తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలి.స్పాన్సర్ అప్రూవల్( Sponsor Approval ) పొందిన తర్వాత, తల్లిదండ్రులు లేదా గ్రాండ్‌పేరెంట్స్ శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.పీజీపీ కోసం ప్రాసెసింగ్ సమయం చాలా ఎక్కువగా ఉంటుంది.

దరఖాస్తును ప్రాసెస్ చేయడానికి రెండు సంవత్సరాల వరకు పట్టవచ్చు.కెనడాలోని కుటుంబాలను తిరిగి కలపడానికి పీజీపీ ఒక గొప్ప మార్గం.

అర్హత ఉంటే, దరఖాస్తు చేసుకోవచ్చు.మరింత సమాచారం కోసం, IRCC వెబ్‌సైట్‌ని విజిట్ చేయవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube