స్టూడెంట్స్‌కు బంపరాఫర్.. గూగుల్‌ ఇంటర్న్‌షిప్‌కు సెలెక్టైతే నెలకు రూ.80 వేలు మీవే...

మంచి శాలరీతో పాటు ఎక్స్‌పీరియన్స్ పొందాలనుకునే వారికి టెక్ దిగ్గజం గూగుల్( Google ) తీపి కబురు అందించింది.వింటర్ ఇంటర్న్‌షిప్‌ను తాజాగా లాంచ్ చేసింది.

 Google Winter 2024 Internship Program Details,google Internship, Software Engine-TeluguStop.com

కంప్యూటర్ సైన్స్ లేదా సంబంధిత రంగాలలో బ్యాచిలర్స్, మాస్టర్స్ లేదా డ్యూయల్-డిగ్రీ ప్రోగ్రామ్‌ల్లో ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు ఇది అందుబాటులో ఉంటుంది.ఈ పెయిడ్ ఇంటర్న్‌షిప్ బెంగళూరు లేదా హైదరాబాద్‌లో జనవరి నుంచి మార్చి 2024 వరకు జరుగుతుంది.నెలకు జీతం రూ.83,947.

Telugu Internship, Science, Google, Software-Latest News - Telugu

దరఖాస్తు చేయడానికి, CV లేదా రెజ్యూమ్, అనధికారిక లేదా అధికారిక ఇంగ్లీష్ ట్రాన్స్‌క్రిప్ట్‌ను సమర్పించాలి.ఆన్‌లైన్‌లో https://cse.noticebard.com/internships/google-winter-internship-2024/లో దరఖాస్తు చేసుకోవచ్చు.దరఖాస్తు గడువు 2023, అక్టోబర్ 1 వరకు ఉంటుంది.

ఇంటర్న్‌షిప్ రియల్-వరల్డ్ ప్రాజెక్ట్‌( Internship Real World Project )లలో పని చేయడానికి, అనుభవజ్ఞులైన ఇంజనీర్‌లతో సహకరించడానికి, పరిశ్రమలోని బెస్ట్- ఇన్-క్లాస్ వాటి నుంచి నేర్చుకునే అవకాశాన్ని ఇస్తుంది.ప్రొడక్టివ్, ఇన్నోవేటివ్ టీమ్ ఎన్విరాన్‌మెంట్‌ను పెంపొందించడం, రొటీన్ టాస్క్‌లను ఆటోమేట్ చేయడానికి స్క్రిప్ట్‌లను రూపొందించడం, సమాచారాన్ని విశ్లేషించడం, సమర్థవంతమైన సమస్య పరిష్కారానికి ఉత్తమ పరిష్కారాలను ఎంచుకోవడం వాస్తవ ప్రపంచ సవాళ్లకు కంప్యూటర్ సైన్స్( Computer Science ) పరిజ్ఞానాన్ని వర్తింపజేయడం వంటి బాధ్యతలను కూడా నిర్వర్తించాల్సి ఉంటుంది.

Telugu Internship, Science, Google, Software-Latest News - Telugu

ఇంటర్న్‌షిప్ కోసం కనీస అర్హతలు తెలుసుకుంటే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్( Software Development ) లేదా సంబంధిత టెక్నికల్ ఫీల్డ్‌లో అసోసియేట్, బ్యాచిలర్ లేదా మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్‌లో ఎన్‌రోల్ అయి ఉండాలి.సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో ఎక్స్‌పీరియన్స్, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ భాషలలో కోడింగ్ ప్రావీణ్యం (C, C++, జావా, జవాస్క్రిప్ట్, పైథాన్) కూడా అవసరమవుతాయి.22-24 వారాలు ఉండే ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లో నెలకు రూ.83,947 జీతం ఇస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube