2019 కాంగ్రెస్ తోనే టీడీపీ పొత్తు..సాక్ష్యం ఇదే.

రాజకీయాలలో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు.ఈరోజు మిత్రులు రేపటి శత్రువులు.

 2019-TeluguStop.com

ఈరోజు శత్రువులే రేపటి మిత్రులుగా అవుతారు ఇది ఇప్పుడు ఏపీ రాజకీయాలకి కచ్చితంగా సూట్ అవుతుంది.రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజన చేశారని కాంగ్రెస్ పార్టీ పై నిప్పులు చెరిగిన ఏపీ పజలు తరువాతి ఎన్నికల్లో పార్టీని భూస్తాపితం చేశారు.

ఏపీలో కాంగ్రెస్ మూలాలు కూడా లేకుండా సమూలంగా పీకి పడేసారు ఏపీ ప్రజలు…అయితే 2014 ఎన్నికల్లో టీడీపీ , బిజెపి కలిసి పోటీ చేసి జనసేన మద్దతుతో ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం అందరికీ తెలిసిందే.అయితే


ఇదే సమయంలో ఇరు పార్టీలు నాలుగేళ్ళు మిత్రభందాన్ని కొనసాగించి చివరి నిమిషం లో ఒకరిని ఒకరు తిట్టుకుంటూ దూరం అయ్యారు ఏకంగా బిజెపి పై కేంద్రం లో తీవ్రస్థాయి లో నిరసన తెలిపారు…చెప్పాలంటే మోడీ పరువు ప్రపంచవ్యాప్తంగా పోయిందన్నా.కర్ణాటకాలో తెలుగువారి ఓట్లు బిజేపి కి పడక అధిక సీట్లని గెలవలేదన్నా అదంతా చంద్రబాబు వలెనేనని చెప్పక తప్పదు.అయితే ఇదే సమయంలో ఎంతో మిత్రులుగా ఉన్న మోడీ చంద్రబాబు శత్రువులుగా మారిపోయారు.

అయితే కర్ణాటకా ఫీటం బిజేపి నుంచీ కాంగ్రెస్ ,జేడీయు చేతికి వెళ్ళిన తరువాత అసలు రాజకీయం మొదలయ్యింది

కుమారస్వామి ప్రమాణ స్వీకారంలో అరుదైన సన్నివేశం ఒకటి కనిపించింది…అదేంటంటే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ – టీడీపీ అధినేత చంద్రబాబు చేయిచేయి కలపడం…ఆప్త మిత్రులుగా మాట్లాడుకోవడం జరిగింది అంతేకాదు… రాహుల్ ను చంద్రబాబు భుజం తట్టి అభినందించారు కూడా.ఏపీ లో ఒక పక్క కాంగ్రెస్ ని నోటికి వచ్చిన మాటలు అంటూ మరో పక్క రాష్ట్రం దాటి వెళ్ళిన తరువాత భుజం భుజం పూసుకుని తిరుగుతున్నారు అంతేకాదు భవిష్యత్తులో కాంగ్రెస్ ,టీడీపీ లు కేంద్రంలో కలిసి ఉంటాయని.

టీడీపీ సప్పోర్ట్ కాంగ్రెస్ కే అన్న వార్తలు కూడా హల్చల్ చేస్తున్నాయి.అందుకు తగ్గట్టుగానే

కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవ వేదికపై నుంచీ సోనియాగాంధీ.రాహుల్ గాంధీ.చంద్రబాబు.

మమతా బెనర్జీ మాయావతి వంటి హేమాహేమీలంతా కలిశారు.థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు విషయం గత కొంతకాలంగా వినపడక పోవడం నుకు ఈ తరుణంలో కర్నాటక సభ వేదికపై ఉన్న పెద్దలంతా ఒకరితో మరొకరు కరచాలనం చేసుకుంటూ చేతులు గాల్లో ఊపారు.

ఇంతలోనే చంద్రబాబు వద్దకు రాహుల్ గాంధీ వచ్చి – షేక్ హ్యాండ్ ఇచ్చారు.ఆ తర్వాత రాహుల్ భుజంపై చంద్రబాబు చేయి వేసి అభినందించారు.

కొన్ని క్షణాలపాటు ఇద్దరూ మాట్లాడుకున్నారు.అంతేకాదు కాంగ్రెస్ వారితో ఎక్కా కూడా అంటీ ముట్టనట్టుగా ఉండే చంద్రబాబు నిన్న రాహుల్ పక్కనే కూర్చోవడం కూడా రాజకీయ వర్గాలలో చర్చలకి దారి తీస్తోంది….

అయితే ఈ పరిణామాలు అన్నీ కూడా 2019 ఎన్నికల నాటికి చంద్రబాబు కాంగ్రెస్ తో కలవడానికి సూచన అని విశ్లేషకులు అభిప్రాయం

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube