చిన జీయర్ స్వామికి పెద్ద షాకిచ్చిన సీఎం కేసీఆర్..

తెలంగాణలో ఉన్న వారికి త్రిదండి చినజీయర్ స్వామి దాదాపు అందరికీ తెలుసు.ఇతడు తెలియని వారు చాలా తక్కువగా ఉంటారు.

 Cm Kcr Big Shock To Chinna Jeeyar Swamy Details, Cm Kcr .. Kcr, Yadadri, Chinna-TeluguStop.com

ప్రవచనాలు చెబుతూ, అందరినీ సన్మార్గంలో నడిపించాల్సిన చిన జీయర్ స్వామి ఈ మధ్య కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ గిరిజన దేవతలైన సమ్మక్క సారలమ్మల విషయంలో చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలపై చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేశారు.

సామాన్యులతో పాటుగా రాజకీయ పార్టీలకు చెందిన అనేక మంది కూడా ఈ వ్యాఖ్యలను ఖండించారు.శంషాబాద్ సమీపంలో చినజీయర్ స్వామి ఆశ్రమం వారు నెలకొల్పిన సమతామూర్తి విగ్రహం మీద కూడా అనేక మంది ఆరోపణలు చేస్తున్నారు.

సమతామూర్తి విగ్రహాన్ని సందర్శించుకోవడానికి టికెట్ ఉంది కానీ సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు ఎటువంటి టికెట్ లేదని చాలా మంది అంటున్నారు.ఎవరెన్ని రకాలుగా విమర్శలు చేసినా కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ టీఆర్​ఎస్ పార్టీ కానీ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.

దీంతో అంతా చిన జీయర్ స్వామికి పెద్దగా ఫరఖ్ పడదని అనుకున్నారు.కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేసిన ఓ చర్య వల్ల చినజీయర్ స్వామికి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య వార్ నడుస్తోందా? అనే ప్రశ్నలు మొదలయ్యాయి.

Telugu Chinnajeeyar, Trs, Yadadri-Latest News - Telugu

యాదాద్రిలో తెలంగాణ ప్రభుత్వం ప్రపంచస్థాయిలో గుడి కట్టింది.ఈ నెల 21 నుంచి 28వ తేదీ వరకు మహాసంప్రోక్షణ పూజల్లో భాగంగా బాలాలయంలో అంతరంగికంగా పంచకుండాత్మక యాగం నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.కానీ ఈ యాగానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలో ప్రభుత్వం చినజీయర్ స్వామి పేరును చేర్చలేదు.చినజీయర్ స్వామి పెట్టిన ముహూర్తానికే యాగం జరుగుతుందని కలెక్టర్ పమేలా సత్పతి ప్రకటించారు.

కానీ చినజీయర్ స్వామి హాజరవుతారని ఆమె ఎక్కడా చెప్పకపోవడం గమనార్హం.ఈ చర్యలతో సీఎం కేసీఆర్​ కు చినజీయర్ స్వామికి మధ్య వైరం ముదిరిందని కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube