“ఎన్నారైల” కి అమెరికా “గుడ్ న్యూస్”

వీసాల జారీ విషయంలో అమెరికా పెట్టిన నిభంధనలకి ఎన్నారైలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ముఖ్యంగా ఎంతో మంది భారతీయులు ఎన్నో ఇబ్బందులని ఎదుర్కొన్నారు.

 America Good News To Nri H2 Visa-TeluguStop.com

అంతేకాదు వర్క్ వీసా పర్మిట్ రద్దు విషయం లో సైతం తమ భార్యల పరిస్థితి ఎలా అంటూ తీవ్రమైన ఆందోళన ఎదుర్కొన్నారు

అయితే నిన్నా మొన్నటి వరకూ ఎంతో ఆందోళనకి లోనవుతున్న వారు తాజాగా ట్రంప్ ప్రకటనతో కొంత ఉపశమనం పొందుతున్నారు.ఇంతకీ ఏమిటా ప్రకటన అంటే.

అమెరికా ప్రభుత్వం అదనంగా 15వేల హెచ్‌-2బీ వీసాలను విదేశీయులకు జారీచేయనున్నట్టు ప్రకటించింది.అంతేకాదు ఈవీసాలు 2018 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జారీ చేసిన 66వేల వీసాల కంటే అదనంగా ప్రకటన చేశారు…ఇదే విషయాన్ని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యురిటీ ప్రకటించింది.ఈ హెచ్‌-2బీ వీసాలను ప్రస్తుతం తాత్కాలికంగా నాన్‌-అగ్రికల్చర్‌ వర్కర్లకు జారీ చేస్తున్నారు.ఈ వీసాల ద్వారా అమెరికన్‌ వ్యాపారాలు పలు అవసరాల నేపథ్యంలో నాన్‌-అగ్రికల్చర్‌ ఉద్యోగాలను పూరించుకోవడం కోసం విదేశీయులను వారి దేశానికి రప్పించడం కోసం ఉపయోగిస్తున్నారు.


అయితే అమెరికన్ వ్యాపారాలని హ్యాండిల్ చేయగలిగేలా నాన్ అగ్రికల్చర్ లేబర్ గా పని చేసేందుకు సరిపడ స్థాయిలో అమెరికన్‌ వర్కర్లు లేరని సెక్రటరీ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యురిటీ కిర్స్టేజెన్ నీ నీల్సన్ చెప్పారు…అయితే వ్యాపార యజమానులతో సమావేశమైన తర్వాత ఆమె ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు డీహెచ్‌ఎస్‌ ప్రెస్‌కు తెలిపింది…అంతేకాదు అసలు హెచ్‌-2బీ వీసాని ప్రత్యేకంగా రూపొందించింది కూడా ఇందుకేనట…ఈ ఏడాది మొదటిలో అత్యధికంగా 33వేల హెచ్‌-2బీ వీసాలు అందుబాటులో ఉంటాయని…వాటికి తోడు మరో 33వేలు వీసాలను ద్వితీయార్థంలో జారీచేయనున్నట్టు హోమ్‌ల్యాండ్‌ సెక్యురిటీ పేర్కొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube