కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గమే కాదు, గుడివాడ మొత్తంగా కూడా దాదాపు 20 ఏళ్లుగా కొడాలి శ్రీవెంకటేశ్వరరావు, ఉరఫ్ నాని హవానే నడుస్తోంది.ఇక్కడ ఆయన ఏపార్టీలో ఉన్నడనేది ప్రధానం కాదు.
ఆయనే ఇక్కడి వారకి ప్రధానం.అందుకే ఇక్కడ కొడాలి నానికి తిరుగు లేకుండా పోయింది.
అయితే, ఆయన ఇప్పుడు వైసీపీలో ఉన్నాడు.అంతేనా.
చాలా బలంగా కూడా ఉన్నాడు.చీటికీ మాటికీ టీడీపీ అధినేత, తనకు మాజీ బాస్ అయిన చంద్రబాబును వాడు వీడు అంటూ బండ బూతులు కూడా తిడుతుంటాడు.
ప్రతి చిన్న విషయంలోనూ టీడీపీకి యాంటీగా చక్రం తిప్పుతున్నాడు.వాస్తవానికి గతంలో టీడీపీలోనే ఉన్న నాని.
అన్నగారు ఎన్టీఆర్కు కరడుగట్టిన అభిమాని.అందుకే గుడివాడ జంక్షన్లో నిలువెత్తు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
అయితే, రాజకీయంగా చంద్రబాబుతో వచ్చిన విభేదాల నేపథ్యంలో నాని.టీడీపీకి రాం రాం చెప్పి వైసీపీలో చేరారు.గత ఎన్నికల్లో గుడివాడ నుంచి భారీ ఆధిక్యంతో గెలుపొందారు.అయితే, దీనిని జీర్ణించుకోలేని స్థానిక నాయకులు నానిని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించారు.అయినా కూడా నాని వారిని ఎదిరించి నిలిచాడు.ఈ క్రమంలోనే మరింతగా బాబును ఢీ కొట్టేందుకు రెడీ అయ్యారు.
దీంతో విసిగిపోయిన చంద్రబాబు.నానిని తిరిగి తన పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నించాడు.
అయితే, దీనికి నాని సుముఖంగా లేకపోగా.బాబు బండారం ఇదీ అంటూ మరోసారి విమర్శల వర్షం కురిపించారు.
దీంతో చంద్రబాబు నానికి గట్టి పోటీ ఇచ్చేవారి కోసం ఎదురు చూస్తున్నారు.నానికి వచ్చే ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని, పదే పదే తనను దూషిస్తున్న నానికి తగిన గుణపాఠం నేర్పాలని బాబు నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలోనే స్థానికంగా బలమైన నేత కోసం బాబు అన్వేషించారు.అయితే, ఆయన అన్వేషణ ఇప్పటికి ఫలించిందని అంటున్నారు టీడీపీ సీనియర్లు.అయితే, నానిని ఓడించేందుకు స్థానిక నేతలు ఎవరికీ అంత సత్తా లేదని బాబు నిర్ణయిం చుకున్నారట.ఈ నేపథ్యంలో రాజమండ్రి ఎంపీ, నటుడు మురళీ మోహన్ కోడలు మాగంటి రూప అయితేనే నానిని ఎదరించి నిలిచే సత్తా ఉన్న నేత అని బాబు గుర్తించినట్టు ప్రచారం జరుగుతోంది.
నిజానికి వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని రూప ఆమె మామ గారు మురళీ మోహన్ భావిస్తున్నా.బాబు ప్లాన్ మాత్రం నానిని ఢీకొట్టే సింగం రూపేనని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.
ఆమె పుట్టిల్లు గుడివాడే కావడం, ఆమె తాత ఎమ్మెల్యేగా సేవలు చేశారు.సో, ఈ నేపథ్యంలో రూప అయితే, గుడివాడ జనానికి ఫుల్గా కనెక్ట్ అవుతుందని, నానికి దిమ్మతిరుగుతుందని బాబు వ్యూహం సిద్ధం చేసుకున్నారట.
ఇదే జరిగి.రూప నానిపై గెలుపొందితే.
చంద్రబాబులో నానిపై ఉన్న కసి మొత్తం తీరుతుందని అంటున్నారు టీడీపీ సీనియర్లు.మరి ఏం జరుగుతుందో చూడాలి.