బన్నీకి షాక్‌ ఇచ్చిన అల్లుడు..!

మెగా హీరో అల్లు అర్జున్‌ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెల్సిందే.అల్లు అరవింద్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది.

 Bellamkonda Srinivas Movie Titled As Speedunnodu-TeluguStop.com

భారీ అంచనాలున్న ఈ సినిమాకు ‘సరైనోడు’ అనే టైటిల్‌ను నిర్ణయించాలని బోయపాటి భావిస్తున్నాడు.ఈ సమయంలోనే ‘అల్లుడు శీను’ ఫేం బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ హీరోగా నటిస్తున్న రెండవ సినిమాకు ‘స్పీడున్నోడు’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేసినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన ‘సుందర పాండ్యన్‌’ చిత్రంకు రీమేక్‌గా తెరకెక్కుతున్న సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ నటిస్తున్న విషయం తెల్సిందే.ప్రముఖ దర్శకుడు భీమినేని శ్రీనివాస్‌ ఈ సినిమాను స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నాడు.

తాజాగా ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది.ఈ నేపథ్యంలో ఈ సినిమా టైటిల్‌ను ‘స్పీడున్నోడు’గా నిర్ణయించాలని భావిస్తునన్నారు.

దాంతో అల్లు అర్జున్‌ ‘సరైనోడు’ టైటిల్‌కు చిక్కులు వచ్చాయి.‘సరైనోడు’ మరియు ‘స్పీడున్నోడు’ టైటిల్స్‌ రెండు కూడా దాదాపుగా సేమ్‌ ఉండటంతో ప్రేక్షకులు కన్ఫ్యూజ్‌ అయ్యే అవకాశాలున్నాయి.

దాంతో అల్లు అర్జున్‌ సినిమాకు బోయపాటి కొత్త టైటిల్‌ను పెట్టే అవకాశాలున్నాయనే టాక్‌ వినిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube