మాస్ మహారాజ రవితేజ మూడు నెలల క్రితం ‘కిక్ 2’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.ఆ సినిమా డిజాస్టర్‌గా మిగిలి పోయింది.
భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ఆ సినిమా రవితేజ కెరీర్‌లోనే అతి పెద్ద ఫ్లాప్‌గా నిలిచింది.ఆ తర్వాత తాజాగా రవితేజ ‘బెంగాల్ టైగర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.
సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ‘బెంగాల్ టైగర్’ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది.అయినా కూడా కలెక్షన్స్ మాత్రం ఆశాజనకంగా రావడం లేదు అంటూ ట్రేడ్ వర్గాల నుండి సమాచారం అందుతోంది.
రవితేజ ‘కిక్ 2’ సినిమాకు భారీ క్రేజ్ రావడంతో పాటు, ఆ సినిమాకు దర్శకత్వం వహించిన సురేందర్ రెడ్డి అంతకు ముందు చిత్రం ‘రేసుగుర్రం’ బ్లాక్ బస్టర్ సక్సెస్ అవ్వడంతో ‘కిక్ 2’పై అంచనాలు తారా స్థాయిలో వచ్చాయి.దాంతో సినిమాకు భారీ స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చాయి.
‘కిక్ 2’ మొదటి రోజు కలెక్షన్స్‌తో పోల్చుకుంటే ‘బెంగాల్ టైగర్’ చిత్రం మొదటి రోజు కలెక్షన్స్ చాలా తక్కువగా ఉన్నాయి.‘కిక్ 2’ను భారీగా విడుదల చేయడంతో పాటు ప్రమోషన్ బాగా చేయడం వల్ల ఆ కలెక్షన్స్ సాధ్యం అయ్యాయి.
కాని ‘బెంగాల్ టైగర్’ మాత్రం అన్నింటిలో విఫలం అయినట్లుగా ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు.అయితే లాంగ్ రన్‌లో మాత్రం ‘కిక్ 2’ చిత్రం కలెక్షన్స్‌ను బెంగాల్ టైగర్ క్రాస్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.







