అనసూయ అప్పుడు గర్భవతి కాబట్టి ఆ పని చేయలేదు

“సూయ సూయ అనసూయ” అంటూ సాయిధరమ్ తేజ్ “విన్నర్” సినిమాలో అనసూయ చేసిన ఐటమ్ సాంగ్ శ్రోతల్ని ఉర్రూతలూగిస్తోంది.ఈ పాటను మరో టీవి యాంకర్ సుమ ఆలపించటం విశేషం.

 Anasuya Rejected That Offer Because Of Pregnancy-TeluguStop.com

ఈ ఐటమ్ సాంగ్ మీద అందరు ఉత్సాహంగానే ఉన్నారు .తెర మీద అనసూయ డ్యాన్స్ చేస్తే చూడాలని వేచి చూస్తున్నారు.

కాని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే పెద్దగా ఆసక్తి చూపించట్లేదు.ఎందుకు అంటే అనసూయ మీద కోపం.అనసూయ మీద కోపం ఎందుకు అంటే, ఒకప్పుడు అత్తారింటికి దారేదిలో ఐటమ్ సాంగ్ ఆఫర్ వస్తే తిరస్కరించి, ఇప్పుడు మరో మెగా హీరో సాయిధరమ్ తేజ్ తో చిందులేసిందిగా.

అయితే పవర్ స్టార్ ఫ్యాన్స్ కోపంలో అర్థం లేదు.

ఎందుకంటే అనసూయ ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయకపోవడానికే చాలా పెద్ద కారణమే ఉందట.ఆ ఆఫర్ వచ్చిన సమయంలో అనసూయ గర్భవతి అంట.అందుకే డ్యాన్స్ చేయడానికి భయపడి ఆఫర్ ని వదులుకుందట.అనసూయ కోసం సింపుల్ స్టెప్స్ కంపోజ్ చేస్తామని చెప్పినా, అనసూయ రిస్క్ తీసుకోలేదు.

ఈ కారణంతో అనసూయ అప్పుడు స్పెషల్ సాంగ్ చేయకలేపోయింది.ఈ విషయం తెలియక పవర్ స్టార్ ఫ్యాన్స్ దాన్ని అవమానభారంలా మోస్తూ, అనసూయ మీద కోపం పెంచుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube